మిషన్ ఇంపాజిబుల్ -7 కి సెకండ్ వేవ్ సెగ.. రిలీజ్ మరింత ఆలస్యం!

Mon May 10 2021 07:00:01 GMT+0530 (IST)

Second wave to Mission Impossible-7

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. టామ్ క్రూజ్ అరివీర భయంకర సాహసవిన్యాసాలను వీక్షించేందుకు పడి చస్తారు. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీలో ఆరు సినిమాలొచ్చాయి. అవన్నీ విజయాలు సాధించాయి. మిషన్: ఇంపాజిబుల్ 7 అనేది ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్. అయితే అభిమానులు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ కాలం ఈ మూవీ కోసం వేచి ఉండాలి. మిషన్: ఇంపాజిబుల్ 7 మే 2022 న విడుదల కానుంది. తాజాగా ఎంఐ7 ఫోటోలు కొన్ని అంతర్జాలంలో రిలీజయ్యాయి.వీటిలో యథావిధిగా టామ్ క్రూజ్ సాహసాలు ప్రత్యక్షమయ్యాయి. అతడు ఒక పెద్ద స్టీమింగ్ లోకోమోటివ్ మీద నిలబడి డర్ట్ బైక్ మీద వేగంగా వెళుతున్న ఫోటో వేడి పెంచింది. ఈ చిత్రాలతో యాక్షన్ సన్నివేశాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని మేకర్స్ సూచించారు. బైక్-సంబంధిత సీక్వెన్స్ ప్రస్తుత ఫ్రాంచైజీ లో ప్రధాన హైలైట్ కానుంది.

మిషన్ ఇంపాజిబుల్ 7 ఒకటి కంటే ఎక్కువసార్లు కొనసాగుతున్న మహమ్మారీ వల్ల ఆపేయాల్సొచ్చిందట. ఇటలీ- ఇంగ్లాండ్- నార్వే- పోలాండ్- మిడిల్ ఈస్ట్ లో చిత్రీకరించారు. తుది షెడ్యూల్ కోసం ఇటీవల తిరిగి ఇంగ్లాండ్ కు వచ్చారు. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఈ చిత్రానికి రచయిత - దర్శకుడు. ఈ ఫ్రాంచైజీని టామ్ క్రూజ్- క్రిస్టోఫర్ మెక్ క్వారీ- డేవిడ్ ఎల్లిసన్ - జేక్ మేయర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇది మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ సిరీస్ ఏడవ సినిమా. మెక్ క్వారీ కి దర్శకుడిగా ఈ సిరీస్‌లో మూడవ చిత్రం. ఈ సినిమా కోసం అభిమానులు వచ్చే ఏడాది సమ్మర్ వరకూ వచి చూడాల్సి ఉంటుంది.