పిక్ టాక్ : పెళ్ళైన తర్వాత డోస్ పెంచి అందాల విందును వడ్డిస్తోంది...!

Sun Jul 05 2020 06:00:05 GMT+0530 (IST)

Pic Talk: Scintillating Shriya Saran Stuns You In Black & White Click!

సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రియా శరన్. 'నా ఇష్టం' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీయా 'కింగ్' నాగార్జునతో నటించిన 'సంతోషం' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు ఈ బ్యూటీకి. శ్రియా శరన్ కొన్నేళ్ల పాటు తన వాలుచూపుతో యువ హృదయాలు కొల్లగొట్టిందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన నాగార్జున చిరంజీవి బాలయ్య వెంకటేష్ మోహన్ బాబు సరసన నటించిన శ్రీయా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రవితేజ ప్రభాస్ ఎన్టీఆర్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోలతో కూడా నటించింది. అంతేకాకుండా శర్వానంద్ - అల్లరి నరేష్ - తరుణ్ లాంటి హీరోల సరసన కూడా మెరిసింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన శ్రీయ ఇప్పటికీ లీడ్ రోల్స్ లో నటిస్తూనే ఉంది. రెండేళ్ల క్రితం ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న అమ్మడు ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్ లో ఉండిపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా అభిమానులకు టచ్ లో ఉంటుంది.డైలీ తన అప్డేట్స్ ఫోలోవర్స్ తో పంచుకునే ఈ ముద్దుగుమ్మ ఎప్పటిలాగే హీట్ పెంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. 37 ఏళ్ళ వయసులో కూడా తన ఫోజులతో ముచ్చెమటలు పట్టిస్తుంది. అందాల విందుని వడ్డించడంలో ఆరితేరిన ఈ బ్యూటీ పెళ్ళైన తర్వాత ఇంకొంచెం డోస్ పెంచేసింది. ప్రస్తుతం కరోనా డేస్ లో ఇళ్లలోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్న రసిక హృదయాలు అమ్మడి ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకి తీస్తున్నారు. ఈ క్రమంలో శ్రియా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలో శ్రియా అందాలు మాత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఇక కాలు పైకెత్తి తొడలు కనిపించేలా అమ్మడు పెట్టిన ఫోజ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇదిలా ఉండగా శ్రియా ఇటీవల సోషల్ మీడియా చిట్ చాట్ లో తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో నటిస్తోంది. దీంతో పాటు మొదటిసారి సృజన అనే లేడీ డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పింది. అంతేకాకుండా రెండు తమిళ సినిమాలు.. 'తడ్కా' అనే హిందీ సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది శ్రియా శరణ్. మొత్తం మీద ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ ఒకటీ రెండు సినిమాలకు పరిమితమవుతుంటే శ్రీయా వచ్చి 20 ఏళ్ళవుతున్నా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ యంగ్ స్టర్స్ కి కూడా కాంపిటేషన్ గా మారుతోంది.