ఫోటో స్టోరి: ఆదర్శ జంట టైటానిక్ ఫీట్ రిపీట్

Sat Jan 29 2022 20:00:01 GMT+0530 (IST)

Sayyeshaa Aarya Latest Photoshoot

తమిళ స్టార్ హీరో ఆర్య తెలుగు వారికి సుపరిచితం. వరుడు చిత్రంలో అల్లు అర్జున్ తో పోటీపడి మరీ నటించాడు. ఆ తర్వాత ఇక్కడా ఫాలోయింగ్ పెరిగింది. ఆర్య నటించిన పలు అనువాద చిత్రాలు తెలుగులో హిట్టయ్యాయి. ఇకపోతే ఆర్య కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే తన కథానాయిక సయేషా సైగల్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.పెళ్లికి వధువు కావాలెను అంటూ ప్రకటనలు గుప్పించిన ఆర్య అంతే బోల్డ్ గా సయేషాని పెళ్లాడేస్తున్నానని ప్రకటించగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. ప్రస్తుతం ఈ జంట సంసారం ఎంతో ఆనందంగా సాగుతోంది. అతని అందమైన భార్య సయేషా తమిళ చిత్ర పరిశ్రమలో ఇంకా నటిగా కొనసాగుతున్నారు. పెళ్లి తర్వాతా సయేషా నటిస్తోంది. ఇక ఈ జంట ప్రస్తుతం మధ్యధరా సముద్రంలో ఉన్న అందమైన ద్వీపం ఐబిజాకు చేరుకుని విహారయాత్రను ఆస్వాధిస్తున్నారు. ఈ జంట ఒక చిన్న దీవిలాంటి చోట ఆస్వాధనలో ఉన్నారని సమాచారం.

ఒక పాపకు తల్లి అయిన అందమైన నటిగా సయేషా అభిమానులకు తెలుసు. ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో తన డార్లింగ్ హబ్బీతో ఉన్న ఫోటోను సయేషా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఆ ఇద్దరూ సముద్రం మధ్యలో ఓడలో ఐకానిక్ టైటానిక్ భంగిమను పునఃసృష్టించారు. అలా ఓడలో తేలియాడే ప్రేమపక్షుల విలాపం ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేయడంతో నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆర్య ప్రస్తుతం శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం `కెప్టెన్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆర్య స్పోర్ట్స్ బయోపిక్ లపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే.