నా మొగుడు తోపు : హీరోయిన్

Sun May 19 2019 12:46:05 GMT+0530 (IST)

Sayesha Saigal Praises Husband Actor Arya

తమిళ స్టార్ హీరో ఆర్య ఇటీవలే హీరోయిన్ సాయేషా సైగల్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరిద్దరు తాజాగా సంతోషకర వైవాహిక జీవితంను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత తన భర్త గురించి ఏ భార్య అయినా గొప్పగా చెబుతుంది. భార్య చేత పొగిడించుకునేందుకు ఏ భర్త అయినా ఆసక్తి చూపిస్తాడు. భార్య మెప్పు పొందేందుకు భర్త కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. భార్య నుండి పొగడ్తలు అందుకున్నప్పుడు ఆ భర్త సంతోషంకు అవధులు ఉండవు. ఇప్పుడు అదే ఆనందంను ఆర్య అనుభవిస్తున్నాడు.తాజాగా ఆర్య హీరోగా రూపొందిన మహాగురు. ప్రముఖ దర్శకుడు శాంత కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహాగురు చిత్రం కోసం ఆర్య కొత్త గెటప్ ను ట్రై చేయడంతో పాటు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా మహా గురు టీజర్ విడుదల అయ్యింది. టీజర్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అందరి ప్రశంసలు పక్కన పెడితే ఇప్పుడు సాయేషా సైగల్ కామెంట్స్ గురించిన చర్చ జరుగుతోంది.

మహాగురు టీజర్ పై సాయేషా ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతో శ్రమించి ఈ చిత్రం కోసం ఆర్య కొత్త గెటప్ తో సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. తన భర్త తోపు అన్నట్లుగా సాయేషా సంతోషం వ్యక్తం చేసింది. ఇదే టీజర్ పై సాయేషా తల్లి కూడా ప్రశంసలు కురిపించింది. సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వారు కలిగి ఉన్నారు.