'పుష్ప' స్టార్ తో కలిసి సత్యదేవ్ మల్టీస్టారర్..!

Fri Sep 30 2022 12:45:29 GMT+0530 (India Standard Time)

Satyadev multistarrer with 'Pushpa' star..!

వర్సటైల్ హీరో సత్యదేవ్ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న టాలెంటెడ్ యాక్టర్.. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఇందులో సత్యదేవ్ తో పాటుగా కన్నడ స్టార్ దాలి ధనంజయ కూడా మరో హీరోగా నటించనున్నాడు.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది సత్యదేవ్ మరియు ధనుంజయ కెరీర్ లో 26వ చిత్రంగా రూపొందుతోంది. ఈశ్వర్ కార్తిక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ లో బాలా సుందరం మరియు దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ని.. ఈరోజు శుక్రవారం (సెప్టెంబర్ 30) ఉదయం అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన మేకర్స్.. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు.

ఈ పోస్టర్ సత్య దేవ్ మరియు ధనంజయ లతో పాటుగా దర్శక నిర్మాతలు కూడా కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ కమర్షియల్ సినిమాలో డబ్బు కనెక్షన్ ను రివీల్ చేస్తూ.. కరెన్సీ నోట్లు కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేసారు.

#SatyaDev26 చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారీ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. యువ అదనపు స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. మీరాఖ్ డైలాగ్స్ రాస్తున్నారు. అనిల్ క్రిష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

సత్యదేవ్ మరియు ధనుంజయ ఇద్దరూ అనేక రకాల పాత్రలతో తమ సొంత మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం హీరో పాత్రలే కాకుండా.. అవకాశం వచ్చినప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ అలరిస్తున్నారు.

సత్యదేవ్ ప్రతినాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సందర్భంగా రిలీజ్ కాబోతోంది. అలానే 'పుష్ప: ది రైజ్' చిత్రంలో జాలిరెడ్డిగా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న ధనుంజయ.. 'పుష్ప 2' లోనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు - కన్నడ ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన నటులు సత్యదేవ్ మరియు ధనుంజయ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రముఖ తారాగణం వంటి ఇతర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.