తిమ్మరుసుగా మారిన ఉమామహేశ్వర

Sun Oct 18 2020 21:00:55 GMT+0530 (IST)

Satyadev is going to act as a hero in the movie Thimmarusu

ఈ లాక్ డౌన్ సమయంలో ఎన్నో సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. చాలా మంది హీరోలు ఈ ఏడాదిలో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా హీరో సత్యదేవ్ పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. 47 డేస్ తో పాటు మరికొన్ని సినిమాలను కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లోనే సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ప్రస్తుతం కూడా ఈయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలోనే మరో కొత్త సినిమాకు సత్యదేవ్ క్లాప్ కొట్టాడు. నేడు లాంచనంగా ప్రారంభం అయిన తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించబోతున్నాడు.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న 'మిస్ ఇండియా' సినిమాను నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తిమ్మరుసు టైటిల్ కు అసైన్ మెంట్ వాలి అనేది ట్యాగ్ లైన్. విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సత్యదేవ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందట. ఈనెల 21 నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు షూటింగ్ ప్రారంభం తర్వత క్లారిటీ రానుంది.