ఈ హీరో నెక్స్ట్ మూవీ కూడా ఓటిటి విడుదలేనా..??

Thu Apr 22 2021 20:00:01 GMT+0530 (IST)

Satya Dev Upcoming Movies updates

లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ నుండి ఏ హీరో కూడా ఓటిటి వేదికగా సినిమాలు విడుదల చేయలేదు. అందులోను ఒకటి.. రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు విడుదల చేసిన హీరో సత్యదేవ్ మాత్రమే అని చెప్పాలి. అందులో ఒకటి 47డేస్ కాగా.. మరొకటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు గువ్వగోరింక. ఈ మూడు సినిమాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. ఇందులో ఉమామహేశ్వర మూవీ మలయాళం నుండి రీమేక్ చేశారు. అయితే సత్యదేవ్ ప్రస్తుతం కంప్లీట్ చేస్తున్న సినిమాలు కూడా ఓటిటిలోనే విడుదల కానున్నాయట. లీడ్ హీరోగా నటుడిగా ఇప్పుడిప్పుడే ఫేమ్ తెచ్చుకుంటున్న సత్యదేవ్.. మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ షాట్స్ నుండి ప్రశంసలు పొందడం విశేషమే. కానీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఓటిటి స్టార్ అంటూ సత్యదేవ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎందుకంటే డైరెక్ట్ ఓటిటిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడని నెటిజన్లు అలా అంటున్నారట. అయితే సత్యదేవ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. ఓవైపు కరోనా మహమ్మారి వణుకు పుట్టిస్తుండటంతో సత్యదేవ్ చేతిలో ఉన్నటువంటి సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తాడని టాక్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట. అందులో తమన్నాతో గుర్తుందా శీతాకాలం తిమ్మరుసు గాడ్సే సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తిమ్మరుసు సినిమా రిలీజ్ కు దగ్గరపడిందని తెలుస్తుంది. అయితే ఈ ఓటిటి తిమ్మరుసు సినిమాను కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తాడని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఎప్పుడు ఎందులో రిలీజ్ చేయనున్నారో..!