బర్త్ డే స్పెషల్... 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్

Sun Jul 03 2022 17:52:50 GMT+0530 (IST)

Satya Dev Krishnamma FL Striking and Powerful

విభిన్న చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆధరణ సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈయన నటిస్తున్న కొత్త సినిమా కృష్ణమ్మ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ సినిమా కి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని సత్యదేవ్ నిలుచుకున్నారు. చాలా పవర్ ఫుల్ లుక్ లో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. ఆయన గతంలో చేసిన పాత్రలకు విభిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడనే టాక్ కూడా వస్తుంది.

కృష్ణమ్మ అనే టైటిల్ విభిన్నంగా ఉందని.. టైటిల్ కు కథకు ఏంటో సంబంధం అంటూ ప్రేక్షకుల్లో సినిమా గురించి ఆసక్తి వ్యక్తం అయ్యేలా ఫస్ట్ లుక్ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సత్యదేవ్ ఇటీవల గాడ్సే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆశించిన స్థాయిలో గాడ్సే సినిమా ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. అంతకు ముందు కూడా సత్యదేవ్ సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చాయి. అయినా కూడా కృష్టమ్మ సినిమాకు పాజిటివ్ బజ్ ఉంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.