వేగేశ్న `కోతి కొమ్మచ్చి` ఆట మొదలెట్టాడు!

Sun Oct 25 2020 22:15:50 GMT+0530 (IST)

Satish Vegesna Kothikommachi Movie Launch

మేఘాంశ్ శ్రీహరి - సమీర్ వేగేశ్నలు హీరోలుగా చక్కని కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం  `కోతి కొమ్మచ్చి` . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన  నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా.. హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు.ఇదో యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అని దర్శకుడు ఈ సందర్భంగా వెల్లడించారు. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి ..సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నామని నిర్మాత అన్నారు. కోతి కమ్మచ్చి టైటిల్ కి తగ్గట్టే చక్కని వినోదాత్మక చిత్రాన్ని వేగేష్న తెరకెక్కించనున్నారు. శతమానం భవతి చిత్రంతో జాతీయ అవార్డ్ సినిమా తీసిన దర్శకుడిగా వేగేష్నకు ప్రత్యేక గౌరవం ఉంది.  రిద్ది కుమార్ మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.