Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ హెయిర్ స్టైల్ చూస్తే ఆ స్వామీజీ గుర్తొస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   5 April 2020 1:30 PM GMT
పవర్ స్టార్ హెయిర్ స్టైల్ చూస్తే ఆ స్వామీజీ గుర్తొస్తున్నాడా..?
X
మన టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు. హీరోలకు ఉన్న గ్లామర్ కు హెయిర్ స్టైల్ తోడై వారు మరింత ఆకర్షణీయంగా కనబడేట్లు చేస్తుంది. కొన్ని సినిమాల కోసం వారు హెయిర్ స్టైల్ పై ప్రయోగాలు చేసి విఫలమైన సందర్భాలూ ఉన్నాయి. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొందరు హీరోలు తమ హెయిర్ స్టైల్ ను పక్కాగా మెయింటెన్ చేస్తుంటారు.మన తెలుగు హీరోలు కేశాలంకరణతోనే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు. స్టార్ హీరోల నుండి ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోల దాకా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. విగ్ ఉపయోగించే హీరోలు సైతం డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టయిల్ విషయంలో సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' సినిమాకి రీమేక్. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. తన కెరీర్లో 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో పవన్ పట్టాలెక్కించాడు. పవన్ కళ్యాణ్ కొద్ది కాలంగా హెయిర్ స్టైల్ ను ఒకేలా మెయింటెన్ చేస్తున్నారు. ఆ లుక్ లోనే ఆయన చాలా గ్లామరస్ గా ఉండడంతో అదే హెయిర్ స్టైల్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ సినిమాల కోసం హెయిర్ స్టైల్ చేంజ్ చేసాడు. ఈ హెయిర్ స్టైల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొత్త లుక్ లో పవన్ చాలా డిఫరెంట్ గా ఉన్నారని, ఈ హెయిర్ స్టైల్ వల్ల పవన్ కు ఇంతకముందు ఉండే స్టైలిష్ లుక్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. ఏంటో.. ఈ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టయిల్... చూస్తుంటే వకీల్ సాబ్ లాగా అనిపించడం లేదు.. అత్తారింటికి దారేది సినిమాలో 'అన్నానికి అరిటాకు.. సున్నానికి తంబాకు...' అంటూ పాట పాడే స్వామీజీ హెయిర్ స్టైల్ లా ఉందంటూ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కి పవన్ ఫ్యాన్స్ కూడా దీటుగానే సమాధానం ఇస్తున్నారు. క్రిష్ సినిమాలో పీరియాడిక్ రోల్ చేస్తుండటంతో దాని కోసమే అలా చేంజ్ చేశాడని చెప్పుకుంటున్నారు. మరి పవన్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో సినిమాలు రిలీజైతే కానీ తెలియదు.