Begin typing your search above and press return to search.

ఆ అందమైన లొకేషన్స్ లో సర్కారు వారి పాట

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:30 PM GMT
ఆ అందమైన లొకేషన్స్ లో సర్కారు వారి పాట
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆలస్యంగా సాగుతోంది. సినిమా ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా మద్యలో కరోనా సెకండ్‌ వేవ్ వల్ల ఆలస్యం అవుతోంది. సినిమా సెకండ్‌ వేవ్ వల్ల షూటింగ్‌ జరుగకున్నా కూడా ముందుగా అనుకున్న ప్రకారం సంక్రాంతికే విడుదల చేస్తామని చాలా నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే నెలతో సినిమా చిత్రీకరణ ముగించాలనే పట్టుదలతో దర్శకుడు పరశురామ్ ఉన్నాడని తెలుస్తోంది. మహేష్‌ బాబు కూడా తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ తో చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పాడు. త్రివిక్రమ్‌ ఎప్పుడెప్పుడు సినిమా పట్టాలెక్కిద్దామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను స్పెయిన్ లో చిత్రీకరిస్తున్నారు.

అందమైన లొకేషన్స్ ఉండే స్పెయిన్ కు ఇటీవలే సర్కారు వారి పాట చిత్ర యూనిట్‌ సభ్యులు వెళ్లారు. మహేష్ బాబు ఇంకా హీరోయిన్‌ కీర్తి సురేష్ ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరుపుతున్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించినంత వరకు ఆ షెడ్యూల్‌ తో మెజార్టీ షూటింగ్‌ పూర్తి అవుతుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్పెయిన్ క్యాపిటల్ అయిన బార్సిలోనా లోని అద్బుతమైన అందమైన లొకేషన్స్ లో సర్కారు వారి పాట సాగుతోంది. కీర్తి సురేష్ మరియు మహేష్ బాబులపై ఒక మంచి రొమాంటిక్ సాంగ్‌ ను బార్సిలోనా లో షూట్‌ చేయబోతున్నారట. అందుకు గాను ఒకటి రెండు రోజుల సమయం తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్ లు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నారు.. అలాగే వీరి కాంబో సన్నివేశాలు మరియు మద్య సాగే లవ్‌ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటాయి అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పరశురామ్‌ ఒక మంచి మెసేజ్‌ ఓరియంటెడ్ కథను అంతకు మించిన లవ్‌ స్టోరీ తో మిలితం చేసి చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ మీడియా వర్గాల వారు సర్కారు వారి పాట గురించి అనుకుంటున్నారు. ఈ నెల చివరి వరకు స్పెయిన్ షెడ్యూల్‌ ను ముగించేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరి షెడ్యూల్‌ ను తిరిగి హైదరాబాద్‌ లో చేస్తారని సమాచారం అందుతోంది అయితే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.