'మహానటి'కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సూపర్ స్టార్...!

Sat Oct 17 2020 12:00:26 GMT+0530 (IST)

Superstar says grand welcome to 'Mahanati' ...!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' అనే సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అనేకమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి రాగా చివరకు మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ని ఫైనలైజ్ చేసారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు 'సర్కారు వారి పాట' మేకర్స్ నుంచి హీరోయిన్ గురించి ఆఫీసియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ ని తీసుకున్నట్లు ప్రకటించారు.మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ''సూపర్ టాలెంటెడ్ కీర్తి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'సర్కారు వారి పాట' టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఇది మీ మరపురాని చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది'' అని పేర్కొన్నారు. 'మహానటి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ఈ సినిమాకు మరో అస్సెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికాలో స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.