Begin typing your search above and press return to search.

సర్కారు వారి అప్డేట్స్ పై స్పందించిన తమన్..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 8:30 AM GMT
సర్కారు వారి అప్డేట్స్ పై స్పందించిన తమన్..!
X
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస మ్యూజికల్ హిట్స్ తో తమన్ హవా మాములుగా లేదు. ఇటీవల రెండుమూడేళ్లుగా తమన్.. అటు దర్శకులకు ఇటు హీరోలకు మోస్ట్ ఫేవరేట్ అయిపోయాడు. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నప్పటికీ తన మ్యూజిక్ తో సినిమాను నిలబెట్టే స్థాయిలో తమన్ పేరు తెచ్చుకున్నాడు. సాంగ్స్ తో పాటు బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ ఇప్పుడు అందరికి బెస్ట్ ఆప్షన్ లా కనిపిస్తున్నాడు. అరవిందసమేత.. మజిలీ.. అలవైకుంఠపురంలో.. క్రాక్.. వకీల్ సాబ్ ఇలా తన ప్రతి సినిమాను సంగీతం పరంగా హైలైట్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.

తమన్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమన్ సంగీతం అనేసరికి సర్కారు పాటపై అందరికి ఆసక్తి పెరిగింది. ఎందుకంటే మహేష్ బాబుతో తమన్ ఆల్రెడీ హ్యాట్రిక్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఖాతాలో వేసుకున్నాడు. వీరి కాంబినేషన్ లో దూకుడు.. బిజినెస్ మ్యాన్.. ఆగడు సినిమాలు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయినవే. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తమన్ - మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తాజాగా తమన్ సర్కార్ సినిమా పై స్పందించాడు. 'సర్కార్ లో మొత్తం 5 పాటలు ఉన్నాయి. అందులో మూడు పాటలు ఆల్రెడీ కంప్లీట్ చేసాను. ఇంకా రెండు మిగిలి ఉన్నాయి.

సర్కార్ ఆల్బమ్ దాదాపుగా మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్ తో ఉండబోతుందని చెప్పాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని కిక్కిచ్చాడు తమన్. తాజాగా అప్డేట్స్ త్వరలోనే అందిస్తామంటూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. అలాగే ఈ సినిమా మ్యూజిక్ కంప్లీట్ చేయడానికి తాను కూడా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్తూ సర్కారు వారి పాట అనే మ్యూజిక్ బిట్ వదిలాడు. ప్రస్తుతం అది ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్.. కాగా సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి, 14 ప్లస్ బ్యానర్స్ తో పాటు మహేష్ కూడా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చేఏడాది సంక్రాంతికి రానుందని సమాచారం.