సర్కారు వారి పాట పాన్ ఇండియా ఇంట్రెస్ట్ లేదా?

Wed Jun 09 2021 10:00:01 GMT+0530 (IST)

Sarkaru Vaari Paata Movie Shooting Updates

ఇటీవల టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పెద్ద హీరోల సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా అంటూ ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాయి. నాలుగు అయిదు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్నా కూడా ఒకటి రెండు మినహా ఎక్కువ శాతం సినిమాలు ఇతర భాషల్లో సక్సెస్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా కూడా నాని నుండి మొదలుకుని అల్లు అర్జున్ వరకు చాలా మంది హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ అంటూ ఉన్నారు. సర్కారు వారి పాట సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా అభిమానులు ప్రచారం చేస్తున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.మహేష్ బాబు నటించిన పలు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. కనుక ఈ సినిమా కూడా  ఇతర భాషల్లో డబ్బింగ్ కాకుండా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సర్కారు వారి పాట సినిమా ఇతర భాషల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కడ కూడా హింట్ ఇవ్వడం లేదు. అంటే పుష్ప సినిమా అయిదు భాషల్లో పోస్టర్ లను విడుదల చేస్తుంది. అలా తెలుగులోనే కాకుండా సర్కారు వారి పాట ఇతర భాషల పోస్టర్ లను విడుదల చేయలేదు. కనుక తెలుగులోనే ఈ సినిమా ను విడుదల చేస్తారని ఇతర భాషల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు అనిపిస్తుంది.

పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలంటే టైటిల్ అన్ని భాషలకు ఒక్కటే ఉండేలా ప్లాన్ చేస్తారు. కాని సర్కారు వారి పాట టైటిల్ ను చూస్తుంటే మాత్రమే మేకర్స్ కు పాన్ ఇండియా ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు త్వరలో రాజమౌళి సినిమా లో నటించబోతున్నాడు. ఆ సినిమా అన్నా అనకున్నా కూడా పాన్ ఇండియా మూవీ అవుతుంది. కనుక తన మొదటి పాన్ ఇండియా మూవీ రాజమౌళి దర్శకత్వంలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడం లేదేమో అంటున్నారు.