సూపర్ స్టార్ పిక్ తో సర్కారు వారి అప్డేట్ ఇచ్చిన థమన్..!

Tue Feb 23 2021 10:18:06 GMT+0530 (IST)

Sarkaru Vaari Paata Movie Shooting Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరాశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ వస్తున్న థమన్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో అప్డేట్ ఇచ్చాడు.'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా జరిగిన దుబాయ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. థమన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ సూపర్ సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని.. కోవిడ్ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ ఈ సినిమా షెడ్యూల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబుకి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశాడు థమన్. ఇందులో మహేష్ బాబు బ్యాక్ సైడ్ వ్యూ లో ఫేస్ కి క్లాత్ కట్టుకుని ఉన్నాడు.

ఇకపోతే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సర్కారు వారి టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. త్వరలోనే గోవాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య ఓ పాటను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' విడుదల కానుంది.