Begin typing your search above and press return to search.

'స‌ర్కార్ వారి పాట' మ‌హేష్ లుక్ వెన‌క మ‌ర్మం?

By:  Tupaki Desk   |   31 May 2020 4:10 AM GMT
స‌ర్కార్ వారి పాట మ‌హేష్ లుక్ వెన‌క మ‌ర్మం?
X
టాలీవుడ్‌ సూపర్ ‌స్టార్‌ మహేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 27వ సినిమా టైటిల్ `సర్కార్ వారి పాట‌` అంటూ ఇంత‌కుముందే మ్యాట‌ర్ లీకైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ ని చిత్ర‌బృందం అధికారికంగా ఖ‌రారు చేస్తూ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా కృష్ణ‌-మ‌హేష్ అభిమానుల‌కు మైత్రి-14 రీల్స్ సంస్థ‌లు కానుక‌గా అందించాయి. టైటిల్‌ పోస్టర్ ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. గీతా గోవిందం ఫేమ్‌ పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్- జీఎమ్‌బీ ఎంటర్ టైన్ ‌మెంట్స్‌- 14 రీల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.

ఈ పోస్ట‌ర్ లో మ‌హేష్ పూర్తి లుక్ మాత్రం రివీల్ చేయ‌లేదు. వెన‌క వైపుగా హాఫ్ లుక్ ని ఓపెన్ చేశారు. ఆ చెవికి రింగు.. ర‌ఫ్ గా క‌నిపించేలా గ‌డ్డం.. బ్లాక్ ష‌ర్ట్ .. ఫ్రీ హెయిర్ స్టైల్ తో మాసీగానే క‌నిపిస్తున్నాడు. వీట‌న్నిటికీ మించి టైటిల్ ప‌ర‌మార్థాన్ని ప్ర‌తిబింబించేలా ఆ మెడ‌పై రూపాయి కాయిన్ టాటూ దేనికో తెలియాల్సి ఉంది. ఈ మూవీకి ఆ పాయింట్‌‌ చాలా కీల‌క‌మైన‌దని భావించాల్సి ఉంటుంది.

ఇక మ‌హేష్ ఈ చిత్రంలో మూడు విభిన్న‌మైన షేడ్స్ లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. యంగ్ కాలేజ్ బోయ్ లుక్ తో పాటు.. ర‌క‌ర‌కాల ఏజ్ ల‌లో డిఫ‌రెంట్ లుక్ తో ట్రీటిస్తాడ‌ని మ‌హేష్ అభిమానుల్లో ప్రచార‌మ‌వుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే ఈ లుక్ యంగ్ ఏజ్ కి సంబంధించిన‌ది అని అర్థ‌మ‌వుతోంది. మ‌హేష్ పూర్తి లుక్ ని కూడా త‌దుప‌రి రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. అత‌డి లుక్ సూప‌ర్భ్ గా ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

త‌మ‌న్ సంగీతం.. పీఎస్‌ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్ గా.. మార్తాండ్ కె వెంక‌టేష్ ఎడిట‌ర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్‌ త్రిపాత్రాభినయం పోషించనున్నారనే వార్తలపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది. అలాగే ప‌ర‌శురామ్ ఎంచుకున్న క‌థాంశంపైనా మ‌రింత క్లూ రివీల్ కావాల్సి ఉంది.