మహేష్ టీజర్ తో వచ్చేస్తున్నాడు!

Tue Oct 22 2019 22:45:16 GMT+0530 (IST)

Sarileru Neekevvaru Teaser Releaser Date

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి దీపావళి ట్రీట్ రెడీ చేస్తున్నారు మేకర్స్. సినిమా కంటెంట్ తో ఓ టీజర్ వదిలి సూపర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను సంతోష పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని రేపో మాపో తేదీ - సమయంతో ప్రకటించబోతున్నారు.అయితే టీజర్ ని చాలా కేర్ ఫుల్ గా రెడీ చేస్తున్నాడు అనీల్ రావిపూడి. మహేష్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ విజయశాంతి క్యారెక్టర్ ను కూడా చూపించబోతున్నడని తెలుస్తుంది. అంటే కాదు రశ్మిక సీన్ కూడా టీజర్ లో ఉండేలా చూసుకుంటున్నారట.

ప్రస్తుతం టీజర్ కి దేవి స్కోర్ ఇస్తున్నట్లు సమాచారం. కంటెంట్ ఇప్పటికే దేవి చేతికి ఇచ్చేసారట. ఇక దీపావళికి 'అల వైకుంఠపురములో' నుండి బన్నీ సాంగ్ సందడి చేస్తే మహేష్ సరిలేరు టీజర్ తో హంగామా చేయబోతున్నాడన్నమాట. ఇక ఈ రెండు సినిమాల సాంగ్ టీజర్ ప్రేక్షకులకు ఈ దీపావళిను మరింత స్పెషల్ గా మార్చబోతున్నాయి.