సరిలేరు టీజర్ ట్రీట్ కి బీరెడీ

Tue Nov 19 2019 19:18:02 GMT+0530 (IST)

Sarileru Neekevvaru Movie Teaser Release Date

`అల వైకుంఠపురములో` పబ్లిసిటీ స్టంట్ తో పోలిస్తే `సరిలేరు నీకెవ్వరు` ప్రమోషన్ వీక్ అంటూ మహేష్ అభిమానులు భావిస్తున్నారు. వరుసగా చార్ట్ బస్టర్ పాటలతో బన్ని టీమ్ వేడెక్కించడంతో దాని ముందు సరిలేరు ప్రమోషన్ సరిపోవడం లేదని ఫ్యాన్స్ లో టాక్ వినిపించింది. అయితే కారణం ఏదైనా.. ప్రత్యర్థి టీమ్ తో పోలిస్తే తాము ఎందులోనూ తగ్గేది లేదని మహేష్ బృందం నిర్ణయించుకున్నట్టే అర్థమవుతోంది. ఇక టీజర్ ట్రీట్ తో ఆరంభించి వరుసగా అదిరిపోయే విజువల్ ఫెస్ట్ కి సరిలేరు టీమ్ రెడీ అవుతోందట. జనవరి 1న ట్రైలర్ తో ట్రీటిచ్చే ముందే రకరకాలుగా ప్రమోషన్ వేడెక్కిస్తారట.తొలిగా `సరిలేరు నీకెవ్వరు` టీజర్ ను మరో మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది.  22 నవంబర్ సాయంత్రం 5.04 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. నవంబర్ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి మహేష్ కి ప్యారలల్ గా ఉండే పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ ప్రొఫెసర్ భారతిగా నటిస్తున్నారు. దసరా - దీపావళికి రిలీజైన పోస్టర్లకు మంచి టాక్ వచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్- ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్- ప్రకాష్‌రాజ్- సంగీత- బండ్ల గణేష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.