Begin typing your search above and press return to search.

స‌రిలేరు హ‌క్కులు ఆ డైరెక్ట‌ర్ చేతి లో

By:  Tupaki Desk   |   13 Nov 2019 4:50 AM GMT
స‌రిలేరు హ‌క్కులు ఆ డైరెక్ట‌ర్ చేతి లో
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడి గా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనీల్ సుంక‌ర‌-దిల్ రాజు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. మ‌హేష్ ఈ చిత్రంలో ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌ లో క‌నిపించ‌నున్నారు. క‌శ్మీర్ బార్డ‌ర్ లో ప‌ని చేసే మేజ‌ర్ క‌ర్నూలు కొండా రెడ్డి బురుజు వ‌ద్ద‌కు ఎందుకు వ‌చ్చారు? అన్న‌ది తెర‌ పైనే చూడాలి. ఇందులో మ‌హేష్ కి ధీటైన పాత్ర‌ లో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌ శాంతి న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన పోస్ట‌ర్లు ఆసక్తి పెంచాయి.

సంక్రాంతి కానుక‌ గా జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. తాజా గా ఈ సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్ జోరందుకుంద‌ని తెలుస్తోంది. మ‌హేష్ కి ఉన్న స్టార్ డ‌మ్ దృష్ట్యా అన్ని ఏరియాల్లో చ‌క్క‌ని ఫ్యాన్సీ రేటును పంపిణీ దారులు ఆఫ‌ర్ చేస్తున్నార‌ట‌. ఇక మ‌హేష్ కూడా ఈ చిత్రం లో ఒక నిర్మాణ భాగ‌స్వామి కాబ‌ట్టి త‌న స‌న్నిహితుల‌ కు కొన్ని ఏరియాల హ‌క్కుల్ని క‌ట్ట‌ బెడుతున్నార‌ని తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ `స‌రిలేరు..` గుంటూరు ఏరియా హ‌క్కుల్ని ద‌క్కించుకున్నార‌ట‌. మెహ‌ర్ ఓ థ‌ర్డ్ పార్టీ ఎగ్జిబిట‌ర్స్ ద్వారా గుంటూరు ప‌రిస‌రాల్లో రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడి గా విఫ‌ల‌మైనా ప‌రిశ్ర‌మ స్టార్ల‌తో చ‌క్క‌ని స‌త్సంబంధాలు కొన‌సాగిస్తుంటారు. ముఖ్యం గా మ‌హేష్ - న‌మ్ర‌తల‌ కు ఎంతో స‌న్నిహితుడు గా ఉంటారు. అలాగే సూప‌ర్ స్టార్ కి చేదోడు వాదోడు గా సాయ‌ప‌డుతుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ స్నేహం తోనే గుంటూరు హ‌క్కుల్ని ఆయ‌న ద‌క్కించుకో గ‌లిగార‌ని టాక్ వినిపిస్తోంది.