పాపం సరిలేరు డిస్ట్రిబ్యూటర్లు.. మింగలేక కక్కలేక!

Sat Jan 18 2020 11:50:06 GMT+0530 (IST)

Sarileru Neekevvaru Movie Distributors Present Position

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో ప్రధాన పోటీ 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' మధ్యనే ఉంది.  ప్రతి సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ సాధారణమే కానీ ఈ సంక్రాంతి పోటీ మాత్రం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ప్రతి విషయంలోనూ పోటీనే.  అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మహేష్ బాబు సినిమా పై చేయి సాధించింది.  అల్లు అర్జున్ సినిమా బిజినెస్ తక్కువకే క్లోజ్ అయింది.  ఇప్పుడు రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోయింది.కలెక్షన్స్ విషయంలో 'సరిలేరు నీకెవ్వరు' కంటే 'అల వైకుంఠపురములో' దూసుకుపోతోంది.  మొదట్లో రెండు సినిమాలు పోటాపోటీగా కలెక్షన్లు నమోదు చేసినా ఇప్పుడు మాత్రం బన్నీ సినిమాదే పైచేయి.  ఒకవైపు 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంటే 'అల వైకుంఠపురములో' మాత్రం అదే జోరు కొనసాగిస్తూ ఉంది.   ఎక్కువ రేట్లు పెట్టి 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్ కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా అనే ఆందోళనలో ఉంటే తక్కువ రేట్ పెట్టి కొన్న 'అల వైకుంఠపురములో' బయ్యర్లు మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారట. ఈ సినిమా లాంగ్ రన్ లో తమకు మంచి లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని నమ్మకంగా ఉన్నారట.  పైకి చెప్తున్న కలెక్షన్స్ ఫిగర్స్ కు సంబంధం లేకుండా బన్నీ సినిమా బయ్యర్లు హ్యాపీ గా ఉన్నారట.

మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ వ్యవహారాలు మింగుడుపడడం లేదని అంటున్నారు.  లాభాలు వస్తాయో రావో దేవుడెరుగు.. అసలు డబ్బు వెనక్కు రాకముందే బ్రేక్ ఈవెన్ అయిందని.. నాన్ బాహుబలి రికార్డులు అని స్వయంగా బయట చెప్పుకోవాల్సి రావడంతో మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉందట వారి పరిస్థితి.  నిజం చెప్పినా అబద్ధం చెప్పినా సేఫ్ జోన్ లో ఉండేవాడు సంతోషంగా ఉంటాడు కానీ సేఫ్ జోన్ లో లేనివాడికి ఎప్పుడూ సమస్యే. ఇప్పుడు 'సరిలేరు నీకేవ్వరు' బయ్యర్ల పరిస్థితి అలానే ఉందట. మరి ఫుల్ రన్ లో అయినా వారికి ఊరట లభిస్తుందేమో వేచి చూడాలి.