ఫోటో స్టోరి: పూల్ సైడ్ పంజా పిల్ల ట్రీట్

Tue Jan 21 2020 19:08:32 GMT+0530 (IST)

Sare Jane Dias In Bikini

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంజా చిత్రంలో నటించింది సారా జేన్ డయాస్. దురదృష్టవశాత్తూ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం తనని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అసలు అవకాశం అన్నదే లేకుండా పోయింది. ఆ తర్వాత సారా అటు తమిళం.. హిందీలో అవకాశాలు వెతుక్కునే పనిలో పడింది.ఇక సోషల్ మీడియాలో నిరంతరం వేడెక్కించే ట్రీట్ ఇస్తున్నా ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకున్నదేం లేదు. తాజాగా సారా మరో కొత్త ఫోటోషూట్ తో అంతర్జాలాన్ని హీటెక్కించింది. ఈ ఫోటోలో పూల్ సైడ్ స్విమ్ సూట్ తో అగ్గి రాజేసింది. ఆ స్విమ్ సూట్ పై చిరుత పులి సంగతేమో కానీ.. సారా వేడెక్కించే రూపం మాత్రం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా స్విమ్ సూట్ కం బికినీలో సారా థై సొగసులు బోయ్స్ కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిచ్చాయి.

ఇటీవలే ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ లో నటించిన సారా స్టార్ స్పోర్ట్స్ రిపోర్టర్ గా నటించిన సంగతి తెలిసిందే. క్రికెటర్ తో ఎఫైర్ నడిపించిన కిలాడీ జర్నలిస్టుగా మైమరిపించింది.  2017లో నటించిన వైస్రాయ్ హోటల్ తర్వాత బాలీవుడ్ లో మరో ఆఫర్ లేదు. కనీసం ప్రస్తుత ప్రయత్నాలు చూస్తుంటే 2020లో అయినా సారా కెరీర్ గ్రాఫ్ మారుతుందనే భావించాలి.