Begin typing your search above and press return to search.

సారంగ దరియా..ఆ 5 సెక‌న్లు దులిపేసి సాయి పల్లవి

By:  Tupaki Desk   |   28 Feb 2021 6:12 AM GMT
సారంగ దరియా..ఆ 5 సెక‌న్లు దులిపేసి సాయి పల్లవి
X
సాయి ప‌ల్ల‌వి అంటే డ్యాన్స్.. డ్యాన్స్ అంటే సాయి ప‌ల్ల‌వి. అంత‌గా పాపుల‌రైన వేరొక న‌టి ఇటీవ‌ల వేరొక‌రు లేరు. ఉన్నా త‌న కాలి గోటిని కూడా ట‌చ్ చేయ‌లేరు. అంత‌టి గొప్ప నృత్య‌కారిణిగా సాయి ప‌ల్ల‌వి పాపుల‌ర‌య్యారు. డ్యాన్స్ బేబి డ్యాన్స్ రియాలిటీ షో విజేత‌గా సాయి ప‌ల్ల‌వికి విప‌రీత‌మైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఇండ‌స్ట్రీలో కొరియోగ్రాఫ‌ర్ గా.. క‌థానాయిక‌గా స‌త్తా చాటిన సాయి ప‌ల్ల‌వి... ఇక మీద‌టా త‌న డ్యాన్సింగ్ ట్రీట్ ని అదే ఒర‌వ‌డితో కొన‌సాగించ‌నున్నార‌ని తాజా విజువ‌ల్ చెబుతోంది.

ఇంత‌కుముందు రౌడీ బేబి సెన్సేష‌న‌ల్ హిట్. దాంతో పాటు ఫిదాలో `న‌చ్చిందే...` సాంగ్ తో యూట్యూబ్ ని గ‌డ‌గ‌డ‌లాడిస్తే.. ఇప్పుడు మ‌రోసారి మారు అలాంటి ఫీట్ తో అల‌రించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఫిదాతో తెరపై సాయి పల్లవి - శేఖర్ కమ్ముల మ్యాజిక్ ఇప్పటికీ జ్ఞాపకాల్లోనే ఉంది. వీరిద్దరూ మ్యూజికల్ మ్యాజిక్ తో తిరిగి వస్తున్నారు. తాజాగా ల‌వ్ స్టోరి నుంచి `సారంగా దరియా` సాంగ్ ప్రోమో విడుద‌లైంది. ఈ పాట‌కు సుద్దాల అశోక్ తేజ లిరిక్ అందించారు. ఇందులో సాయి ప‌ల్ల‌వి డ్యాన్సుల‌కు మ‌రోసారి ఫిదా అయిపోవాల్సిందే. గ్రామీణ సాంప్ర‌దాయం ఉట్టిప‌డుతున్న ఈ పాట‌లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సాహితీ విలువ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. జాతీయ అవార్డ్ గ్ర‌హీత సుద్దాల అశోక్ తేజ మ‌రోసారి చ‌క్క‌ని ప‌ద‌జాలంతో మైమ‌రిపింప‌జేసారు.

పవన్ సిహెచ్ ఆకర్షణీయమైన ట్యూన్ ర‌క్తి క‌ట్టించింది. సాయి పల్లవి ఆ ఐదు సెక‌న్ల పాటు అదిరిపోయే నృత్యంతో దుమ్ము దులిపేసిందంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రోసారి సాయి ప‌ల్ల‌వి మ్యాజిక్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే అర్థ‌మ‌వుతోంది. సమంతా అక్కినేని ఈ పాటను ఆవిష్కరించడ‌మే గాక‌... ఈ సీజన్ ని సాయి ప‌ల్ల‌వి నృత్యాలు ఊపేయ‌డం ఖాయం అంటూ ప్ర‌శంసించారు. ఇదే సింగిల్ లో మేకింగ్ విజువ‌ల్స్ ని చూపించారు. నాగ‌చైత‌న్య ఈ చిత్రంలో కథానాయ‌కుడిగా న‌టించారు. నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. సునీల్ నారంగ్ - రామ్‌మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 16 న విడుదల కానుంది.