వీడియో : హీరోయిన్ ముక్కుకు గాయం.. సారి చెప్పింది

Tue Aug 03 2021 21:00:01 GMT+0530 (IST)

Sara Ali Khan daughter of Bollywood star Saif Ali Khan

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఈమద్య కాలంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంటూ ఉంది. ఈమె వరుసగా సినిమాల్లో నటిస్తూ కష్టపడి సొంతంగా స్టార్ డమ్ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. బరువు తగ్గడం మొదలుకుని ఇప్పటి వరకు ప్రతి విషయంలో కూడా సైఫ్ అలీ ఖాన్ కూతురు అని కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో సారా అలీ ఖాన్ నటిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం నటిగా పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రమాదవశాత్తు ముక్కు పగులకొట్టుకుంది.ముక్కు పగిలిన వీడియోను కాస్త ఫన్నీగా ఈమె రివీల్ చేసింది. ముక్కు పై పెద్ద కప్ పేపర్ ను పెట్టుకుని.. అమ్మ నాన్న ఇగ్గీ క్షమించండి. ముక్కు పగులకొట్టుకున్నాను నేను అంటూ కామెంట్ పెట్టింది. ముక్కు పై ఉన్న ఆ పేపర్ ను తొలగించడంతో అంతా కూడా బాబోయ్ అన్నట్లుగా ముక్కు మరీ పచ్చడిగా అయ్యంది. సాదారణంగా హీరోయిన్స్ చాలా సున్నితంగా ఉంటారు. కాని సారా అలీ ఖాన్ మాత్రం అంత గాయం అయినా కూడా డేర్ గానే వీడియోలో కనిపిస్తుంది. అందుకు ఆమెను అభినందించి తీరాల్సిందే.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. కేదార్‌నాథ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్ గా కమర్షియల్ గా సక్సెస్ దక్కించుకోలేక పోయినా కూడా సినిమా మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆత్రంగిరే అనే సినిమాను చేస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి.