తండ్రి కొడుకుల గొడవను కన్ఫర్మ్ చేసిన హీరోయిన్

Fri Dec 04 2020 06:18:32 GMT+0530 (IST)

The heroine who confirmed the father-son quarrel

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ మరియు ఆయన తనయుడు యంగ్ హీరో వరుణ్ ధావన్ ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ గత కొంత కాలంగా నడుస్తోంది. అయితే వారి సన్నిహితులు మాత్రం అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టి పారేస్తూ వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ సారా అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. అసలు విషయం ఏంటీ అంటే దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన కూలీ నెం.1 సినిమాను వరుణ్ ధావన్ మరియు సారా అలీ ఖాన్ జంటగా డేవిడ్ ధావన్ రీమేక్ చేస్తున్నాడు. అప్పుడు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ ఇప్పుడు కూడా దర్శకత్వం వహించాడు.షూటింగ్ సమయంలో తండ్రి కొడుకులు అయిన డేవిడ్ మరియు వరుణ్ ల మద్య చిన్న చిన్న గొడవలు అయ్యాయి అంటూ యూనిట్ వర్గాల వారు చెబుతూ ఉండేవారు. ఇక కూలీ నెం.1 సినిమాను ఈనెల 25వ తారీకున అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చింది.

ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఒక సారి నేను షూటింగ్ కు రెడీ అయ్యి ఉన్నాను. వరుణ్ మాత్రం తన వ్యాన్ దిగలేదు. ఆయన రాకపోవడంతో నాపై డేవిడ్ సర్ అరిచాడు. ఆ సమయంలో నాపై చూపించిన కోపం వరుణ్ పై కోపం అని తర్వాత అర్థం అయ్యింది. ఆ తర్వాత అంతా సెట్ అయ్యిందని అసలు విషయాన్ని మెల్లగా క్లారిటీ ఇచ్చేసింది.