కెరీర్ రివ్యూలేనా ఫిట్నెస్ లోనూ ఎక్కడా తగ్గదు

Thu Jun 17 2021 22:00:01 GMT+0530 (IST)

Sara Ali Khan Latest Photo

సైఫ్ అలీఖాన్ నటవారసురాలు సారా అలీఖాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు చిత్రాల్లో నటించింది సారా. ప్రతి చిత్రం దేనికదే భిన్నమైనది. ప్రతి పాత్ర ఆసక్తికరం. సారా ప్రయాణంలో ఇప్పటివరకు ప్రేక్షకులు గుర్తించదగినవి ఉన్నాయి. భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులలో భాగం కావాలని సారా ఆశిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ మాట్లాడుతూ తన చిత్రాలలో కేదార్‌నాథ్ తర్వాత అట్రాంగి రే ఎంతో ప్రత్యేకమైనది అని తెలిపింది. 2018 లోనే అభిషేక్ కపూర్ కేదార్‌నాథ్ చిత్రంతో సారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. తరువాత ఆమె రోహిత్ శెట్టి - సింబా.. ఇంతియాజ్ అలీ -లవ్ ఆజ్ కల్.. డేవిడ్ ధావన్- కూలీ నంబర్ 1 లో నటించింది. ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్- అట్రాంగి రే లో నటిస్తోంది. ఈ సినిమాతో తనకు చాలా కనెక్టివిటీ ఉందని సారా భావిస్తోంది.

ప్రతి ప్రాజెక్టుకు వందశాతం పని చేయాలి. జయాపజయాల్ని ప్రేక్షకులే నిర్ణయించాలి అని ఆమె అన్నారు. గెలుపోములు లేదా ప్రశంసలు లేదా విమర్శలను స్వీకరించాలని సారా అన్నారు. నేను నటించిన ప్రతి సినిమాను ఒకే విధంగా చూస్తానని సారా వ్యాఖ్యానించారు. ప్రేక్షకులక నచ్చేదేమిటి? నచ్చనిదేమిటి?  నేను ఏది పునరావృతం చేయాలి? ఏది పునరావృతం చేయకూడదు.. అనేది ఆలోచిస్తాను. ఏదైనా నేర్చుకోవడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించింది .

లవ్ ఆజ్ కల్ విడుదలైన 10 రోజుల తరువాత సారా అట్రాంగి రే షూటింగ్ ప్రారంభించింది. మహమ్మారి రంగ ప్రవేశంతో గందరగోళంగా ప్రతిసారీ షూటింగ్ చేస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా మానసికంగా కఠినమైన సమయం అని నేను భావిస్తున్నాను.. అని తెలిపింది. ఇక సారా అలీఖాన్ రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా సారా యోగా తరగతులకు అటెండవుతున్న ఫోటోని షేర్ చేయగా వైరల్ గా మారింది.