నటవారసురాలు ఎందులోనూ తగ్గరుగా

Fri Nov 08 2019 21:28:33 GMT+0530 (IST)

Sara Ali Khan Gym Pic

బాలీవుడ్ లో నటవారసుల వెల్లువలో కాంపిటీషన్ పెద్దగానే ఉంది. ఈ పోటీని ఎదుర్కొని సత్తా చాటాలంటే అందరి దృష్టిని ఆకర్షించాల్సిందే.  రంగుల ప్రపంచంలో జిగ్ జాగ్ కి ఉండే ప్రాధాన్యత కూడా అలాంటిదే. అందుకే ఇటీవల నవతరం కథానాయికలంతా సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసం వెంపర్లాడుతున్నారు. అక్కడ చిట్టి పొట్టి నిక్కర్ల షోతో పాటుగా బికినీలు స్పోర్ట్ డ్రెస్ లతో వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. నిరంతరం జిమ్మింగ్ ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలుస్తున్నారు.స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలు సారా అలీఖాన్ ఇందుకు అతీతురాలేం కాదు. పోటీప్రపంచాన్ని ఎలా ఈదాలో తనకు బాగా తెలుసు. ఈ క్యూట్ బ్యూటీ రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్. జాన్వీ.. తారా సుతారియా.. అనన్య పాండే లాంటి నటవారసురాళ్లకు ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. ఇప్పటికే సింబా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన 'ఆజ్ కల్`' అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా 2020 ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. దీంతో పాటు జూ.సల్మాన్ గా పాపులరైన వరుణ్ ధావన్ సరసన 'కూలీనంబర్ -1' రీమేక్ లో నటిస్తోంది.

తాజాగా యంగ్ సారా జిమ్ చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇందులో బ్యాక్ ఫీట్ లో టోన్డ్ బాడీని ఎలివేట్ చేస్తూ కనిపిస్తోంది. ఈ పర్ఫెక్ట్ టోన్డ్ లుక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. వర్కవుట్స్ విషయంలో  పటౌడీ వారసురాలు అస్సలు తగ్గేట్టు లేదు. ఎంత సుకుమారంగా పెరిగిందో అంతకుమించిన హార్డ్ వర్క్ చేస్తూ పదిమందికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రంగుల ప్రపంచంలో రాణించాలంటే ఆమాత్రం శ్రమించాల్సిందే మరి.