వాటిని చేసేందుకు నేను రెడీ : సప్తగిరి

Thu Jun 13 2019 07:00:02 GMT+0530 (IST)

కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సప్తగిరి పలువురు కమెడియన్స్ మాదిరిగానే హీరోగా మారాడు. హీరోగా మారిన సప్తగిరి ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటిది సప్తగిరి ఎక్స్ ప్రెస్ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ సినిమాతో సప్తగిరి హీరోగా మంచి పేరు మరియు కలెక్షన్స్ దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమా సప్తగిరి ఎల్ ఎల్ బి చిత్రం కూడా మంచి పేరును అయితే తీసుకు వచ్చింది. కాని ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం అంతగా ఆడలేదు. సప్తగిరి ఎల్ ఎల్ బి చిత్రంలోని సప్తగిరి నటనకు మంచి మార్కులు పడ్డాయి.సప్తగిరి ఎల్ ఎల్ బి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సప్తగిరి తాజాగా 'వజ్రకవచధర గోవింద' చిత్రం చేయడం జరిగింది. ఆ చిత్రం భారీ అంచనాల నడుమ రూపొందింది. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని ఏరియాల్లో కూడా భారీగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సప్తగిరి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భవిష్యత్తు ప్రణాళికను వెళ్లడించాడు.

నేను హీరోగా చేస్తున్నా కనుక కమెడియన్ గా చేయనని కొందరు ప్రచారం చేస్తున్నారు. కాని నాకు కమెడియన్ గా నటించకూడదని ఏమీ లేదు. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు. సహాయ దర్శకుడిగా కావాలనుకున్న నన్ను కమెడియన్ ను చేశారు. అదే సమయంలో హీరోగా కూడా ఆధరించారు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు నేను అన్ని రకాల పాత్రలు పోషించేందుకు సిద్దం అంటూ క్లారిటీ ఇచ్చారు. సప్తగిరితో ఇప్పుడైనా డైరెక్టర్స్ కామెడీ రోల్స్ చేయిస్తారేమో చూడాలి.