Begin typing your search above and press return to search.

సప్తగిరి ఈసారి మరింత హీరోయిజం..!

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:30 PM GMT
సప్తగిరి ఈసారి మరింత హీరోయిజం..!
X
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పలువురు హీరోలుగా మారి తమ జాతకంను పరీక్షించుకున్నారు. కొందరు సూపర్‌ హిట్‌ అవ్వగా కొందరు మాత్రం నిరాశ పర్చారు. కొందరు కొన్నాళ్లు హీరోలుగా ఉండి ఆ తర్వాత మళ్లీ కమెడియన్స్ గా మారారు. ఇక సప్తగిరి విషయానికి వస్తే కమెడియన్ గా ఎన్నో సినిమాలను చేశాడు. ఆయన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు. తాజాగా మరోసారి సప్తగిరి హీరోగా ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమా కు 'గూడుపుఠాణి' అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్ లో సప్తగిరి కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇన్ని రోజులు హీరోగా నటించినా కూడా ఆయన కమెడీ చేస్తూ వచ్చాడు. కాని ఈ సినిమాలో మాత్రం ఆయనలోని కామెడీ యాంగిల్ కాకుండా ఆయనలోని హీరోయిజంను ఎక్కువగా చూపించబోతున్నారు. గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో సప్తగిరి హీరోయిజం ను ఎక్కువగా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సప్తగిరి హీరోగా నటించిన గూడుపుఠాణి సినిమాకు గాను కే ఎం కుమార్ దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను రూపొందించినట్లుగా ట్రైలర్‌ ను బట్టి అర్థం అవుతోంది. సప్తగిరి ఈ సినిమా కమర్షియల్‌ హీరోగా పేరు తీసుకు వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఒక చక్కని ప్రేమ కథను ఇందులో చూపించడంతో పాటు మెల్లగా యాక్షన్‌ జోనర్ లోకి ఈ సినిమాను దర్శకుడు తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రఘు కుంచె పోషించిన పాత్ర మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈమద్య కాలంలో రఘు కుంచె విలన్ గా చేసిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాలో ఆయన ఉండటం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రౌడీగా రఘు కుంచె.. హీరోగా సప్తగిరి కాంబినేషన్ విభిన్నంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోగా సప్తగిరి ఒక మంచి టర్నింగ్ పాయింట్‌ గా గూడుపుఠాణి నిలుస్తుందనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.