Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమా ప్రమోషన్స్ ఎక్కడ ?

By:  Tupaki Desk   |   23 Oct 2019 1:30 AM GMT
సంక్రాంతి సినిమా ప్రమోషన్స్ ఎక్కడ ?
X
వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' , అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' కూడా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బడా సినిమాల మధ్య ఈ సినిమా ప్రమోషన్స్ వీక్ అనిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికే ఫస్ట్ లుక్ వదిలారు. లేటెస్ట్ గా దసరాకి ఓ టీజర్ కూడా రిలీజ్ చేసారు. కానీ అక్కడితో ప్రమోషన్స్ కి బ్రేక్ ఇచ్చారు మేకర్స్.

ఒక వైపు సంక్రాంతి బడా సినిమాల నుండి ఏదొక అప్డేట్ తో పోస్టర్స్ - సాంగ్స్ వస్తుంటే 'ఎంత మంచి వాడవురా' నుండి మాత్రం ఇంకా సాంగ్స్ - పోస్టర్స్ రావడం లేదు. నిజానికి సంక్రాంతి పోటీలో రెండు సినిమాల కంటే కళ్యాణ్ రామ్ సినిమాకే ప్రమోషన్స్ ఎక్కువ అవసరం.

ఎక్కడ చూసినా ఈ సినిమా ఏదో రూపంలో ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉండాలి. లేదంటే మినిమం హైప్ కూడా రాదు. ఈ దీపావళికి పోస్టరో లేదా మరో టీజర్ వదిలాల్సిందే. అప్పుడే మళ్ళీ హంగామా మొదలవుతుంది. మరి దీపావళి నుండైనా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో వేగం పెంచుతరేమో చూడాలి.