Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌క‌ర సంక్రాంతి చుక్క ఈ చ‌క్క‌న‌మ్మ‌

By:  Tupaki Desk   |   15 Jan 2021 6:23 AM GMT
ఫోటో స్టోరి: మ‌క‌ర సంక్రాంతి చుక్క ఈ చ‌క్క‌న‌మ్మ‌
X
గొబ్బెమ్మ‌ల పండ‌గ సంక్రాంతికి తెలుగు లోగిళ్ల‌లో సంద‌డి గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప‌ల్లెల్లో ఇంటింటా అల్లుళ్ల‌‌తో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. పిండి వంట‌లు ఆర‌గిస్తూ నాటు కోడి ఇగురును ఎంజాయ్ చేసే అల్లుళ్ల‌కు కొద‌వేమీ లేదు. మ‌రోవైపు సాంప్ర‌దాయ పూజ‌లతో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఇంటింటా ఉంటుంది. ఇక థియేట‌ర్ల చెంత కోలాహాలం వేరు. క్రైసిస్ లోనూ థియేట‌ర్ల‌కు జ‌నం క్యూ క‌డుతుండడం ఆస‌క్తిక‌రం. ఇక సంక్రాంతి వేళ‌ ఇంట్లో మ‌గువ‌లు ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ట్రెడిష‌న‌ల్ లుక్ తో అల‌రిస్తుంటారు.

ఈసారి సెల‌బ్రిటీల ఇంటా ఈ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని మెగా- అల్లు కోడ‌ళ్లు ఉపాస‌న‌-స్నేహారెడ్డి ఓచోట‌ క‌లుసుకుని పండ‌గ‌ను సెల‌బ్రేట్ చేసుకున్న ఫోటో ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యింది.

తాజాగా ట్రెడిష‌న‌ల్ శారీలో తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా సంక్రాంతి క‌ళ‌ను గుర్తుకు తెచ్చింది. హ్యాపీ మ‌క‌ర సంక్రాంతి! అంటూ తెలుగు ప్ర‌జ‌ల‌కు అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది ఇషా. ఈ డిజైన‌ర్ లుక్ లో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఆ స్పెష‌ల్ డిజైన‌ర్ ప‌ట్టు చీర‌.. దానికి కాంబినేష‌న్ భారీ జువెల‌రీతో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఇషా ఫుల్ బిజీగా ఉంది. అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల్లో ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూనే క‌థానాయిక‌గానూ ఈ భామ రాణిస్తోంది. అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ బ్యూటీ `ఆయిర‌మ్ జెన్మంగ‌ళ్` అనే తమిళ చిత్రంలోనూ న‌టిస్తోంది. ల‌స్ట్ స్టోరీస్ -తెలుగు వెబ్ సిరీస్ లోనూ వేడి పెంచే పాత్ర‌లో ఇషా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఇది స్ట్రీమింగ్ కానుంది.