ప్రేమిస్తున్నా కాని అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో..!

Fri May 29 2020 11:15:30 GMT+0530 (IST)

Sanjjanaa Galrani gives clarity on her marriage

తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన సంజనకు ఆశించిన స్థాయి గుర్తింపు దక్కలేదు. సెకండ్ హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు తెలుగులో స్టార్ డంను పొందలేక పోయింది. దాంతో కన్నడ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక్కడితో పోల్చితే అక్కడ బెటర్ గానే ఈ అమ్మడు ఆఫర్లు పొందింది. కన్నడలో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ఆమద్య పెళ్లికి సిద్దం అఅయ్యిందని వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది.ఇటీవల మరో సారి ప్రేమ పెళ్లి విషయమై మాట్లాడుతూ.. తాను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొంది. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్న విషయం నిజమే కాని పెళ్లి విషయంలో మాత్రం తాను ఏ నిర్ణయం తీసుకోలేదు అంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానా లేదా మరెవ్వరినైనా పెళ్లి చేసుకుంటానా అనే విషయంను ఇప్పుడే చెప్పలేను అంది.

ఒక వైపు ప్రేమిస్తున్నాను అంటూనే మరో వైపు అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో చెప్పలేను అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈమద్య కాలంలో అన్ని భాషల ఇండస్ట్రీల్లో ప్రేమ పెళ్లిలు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రేమ పెళ్లిలకు ఎవరు అడ్డుపడటం లేదు. అయినా ఈమె మాత్రం ప్రేమించిన వ్యక్తిని చేసుకుంటానో లేదో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.