ఫోటో స్టోరి: ఆమె ఓ బిడ్డకు మమ్మీ తెలుసా?

Wed Jun 16 2021 09:00:01 GMT+0530 (IST)

Sanjeeda Sheikh Latest Photo

అందానికి అందం మిల్కీ వైట్ దేహశిరులతో కవ్వించే టీవీ నటిగా సంజీదా షేక్ సుపరిచితం. ఈ బ్యూటీ పలు హిందీ చిత్రాల్లోనూ నటించింది. సంజీదా సోషల్ మీడియా పోస్టులు యువతరంలో నిరంతరం హాట్ టాపిక్. అయితే ఈ బ్యూటీ జీవితంలో ఊహించని మలుపులు ఎన్నో.2019 లో సర్రోగసీ ద్వారా జన్మించిన తన కుమార్తె ఐరా ఫోటోని అప్పట్లో సంజీదా షేక్ షేర్ చేశారు. సరిగ్గా తన బిడ్డ జన్మించిన అనంతరం భర్తకు విడాకులు ఇవ్వడం చర్చకు వచ్చింది. సంజీదా తమ బిడ్డ ఫోటోలను గత ఏడాది ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. తమకు దేవదూత జన్మించిందని సంబరపడడం కనిపించింది. కానీ ఇంతలోనే ఈ జంట విడిపోయారన్నది అభిమానులను కలవరపరిచింది.

ఓ  ఇంటర్వ్యూలో సంజీదా తన కుమార్తె తన ఏకైక తోడు అని  వెల్లడించింది. జీవితం గొప్పది. నేను దానిని సరళంగా ఉంచాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు ఒక స్నేహితురాలు ఉంది. నా జీవితంలో నాకు ఉన్న ఏకైక సహచరుడు ప్రస్తుతం నా కుమార్తె అని వెల్లడించింది. ఇక సంజీదా లేటెస్ట్ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా మారింది. ఇందులో రకరకాల భంగిమల్లో హాటెస్ట్ బాడీని సంజీదా ఎలివేట్ చేసింది.