మోడీ జీవితంలోని ఆ మలుపును చూపిస్తారట

Tue Sep 17 2019 07:00:02 GMT+0530 (IST)

Sanjay Leela Bhansali comes on board for movie on PM Narendra Modi

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నరేంద్రమోడీ 2014లో అనూహ్యంగా భారత ప్రధాని అయిన విషయం తెల్సిందే. ఒక సామాన్య చాయ్ వాలా భారత ప్రధానిగా ఎదగడం మామూలు విషయం కాదు. ఆయన జర్నీ అంత సింపుల్ గా ఏమీ సాగలేదు. వైవాహిక జీవితం.. కుటుంబ జీవితంపై ఆసక్తి లేక యుక్త వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్ వైపు ఆకర్షితుడు అయిన నరేంద్ర మోడీ గురించి ఈతరం యువతకు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉందని అందుకే ఆయన గురించి మరో బయోపిక్ తీసేందుకు సిద్దం అవుతున్నట్లుగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ అంటున్నాడు.నరేంద్ర మోడీ జీవితం అంతా తెరిచిన పుస్తకమని అంతా అనుకుంటున్నారు. కాని ఆయన యుక్త వయసులో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ మరియు దేశం గురించి ఆయన ఆలోచన ఎలా ఉండేది అనే విషయాలు ఎవరికి తెలియవు. మోడీ జీవితంలో ఆ మలుపు చాలా కీలకం. అందుకే ఆ విషయాలతో మోడీ బయోపిక్ ను నిర్మించేందుకు సంజయ్ లీలా భన్సాలీ సిద్దం అయ్యాడు. కథ బాగా నచ్చడంతో నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా సంజయ్ లీలా భన్సాలీ అంటున్నారు. సంజయ్ త్రిపాఠి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో వివేక్ ఒబేరాయ్ లీడ్ రోల్ లో 'నరేంద్ర మోదీ' చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో టచ్ చేయని అంశాలతో సంజయ్ త్రిపాఠి తన మోడీ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి 'మన్ బైరాగీ' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్బంగా ఈనెల 17న విడుదల చేయబోతున్నారు.