Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ అప్‌డేట్‌ : అధీరా చివరి పని ముగించేశాడు

By:  Tupaki Desk   |   7 Dec 2021 2:33 PM GMT
కేజీఎఫ్‌ అప్‌డేట్‌ : అధీరా చివరి పని ముగించేశాడు
X
కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ కీలకమైన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఈ ఏడాదికి వాయిదా పడగా.. రెండవ వేవ్ కారణంగా వచ్చే ఏడాదికి సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను దర్శకుడు సంజయ్ దత్‌ సేఫ్ టైమ్‌ లో పోటీ లేని సమయంలో విడుదల చేసే ఉద్దేశ్యంతో 2022 ఏప్రిల్‌ 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కాని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్యాచ్‌ వర్క్‌ పేరుతో ఎప్పుడు ఏదో ఒక షూట్‌ చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు సంజయ్ దత్‌ షూటింగ్‌ పూర్తి అయినట్లుగా ఉంది. అందుకే ఆయన కేజీఎఫ్‌ 2 కోసం డబ్బింగ్‌ చెప్పాడు.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పక్కన ఉండి సంజయ్ దత్‌ తో అధీరా పాత్రకు డబ్బింగ్‌ చెప్పించాడు. కేవలం హిందీ వర్షన్‌ లో మాత్రమే సంజయ్ దత్‌ వాయిస్ వినిపిస్తుందా.. లేదంటే అన్ని భాషల్లో కూడా ఆయన మాటే ఉంటుందా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ 2 తో సౌత్‌ లో అడుగు పెట్టబోతున్న సంజయ్‌ దత్‌ వెంటనే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం అంటే సాధ్యం అయ్యేది కాదు. కనుక కేవలం హిందీ వర్షన్‌ కు మాత్రమే సంజయ్ దత్‌ తన వాయిస్ ఇస్తూ ఉంటాడని అంటున్నారు. సంజయ్ దత్‌ లుక్ అత్యంత భయంకరంగా ఉంటుంది. పాత్ర కూడా చాలా అద్బుతంగా ఉంటుందని.. హీరో తో సమానమైన పాత్ర అని.. ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఈ పాత్ర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఈ పాత్రకు గాను సంజయ్ దత్‌ ను తీసుకోవడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది.

కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల కోసం అభిమానులు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కేజీఎఫ్‌ 2 సినిమా ను ఏప్రిల్‌ లో విడుదల చేస్తామని అంటున్నారు. అయితే అదే రోజున మరో సినిమా కూడా విడుదల ఉంటుందని అంటున్నారు. అది బాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమా అవ్వడం వల్ల కేజీఎఫ్‌ సినిమా పై మళ్లీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటూ కేజీఎఫ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా మరీ ఏప్రిల్‌ వరకు కాకుండా జనవరి ఫిబ్రవరిలోనే విడుదల చేస్తే బాగుండేది అంటూ యశ్‌ అభిమానులు ఉబలాట పడుతున్నారు. కేజీఎఫ్ 2 సినిమా తో మరోసారి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాస్‌ యాక్షన్‌ అంటే ఏంటో విశ్వరూపం చూపించబోతున్నాడట.