Begin typing your search above and press return to search.

సంజ‌న Vs రాగిణి: జైల్లోనే ద‌స‌రా పండ‌గ‌.. దీపావ‌ళికి అయినా..?!

By:  Tupaki Desk   |   27 Oct 2020 9:50 AM GMT
సంజ‌న Vs  రాగిణి: జైల్లోనే ద‌స‌రా పండ‌గ‌.. దీపావ‌ళికి అయినా..?!
X
చీటికి మాటికి జైల్లో కీచులాడుకుంటున్నారు అంటూ ఇటీవ‌ల సంజ‌న‌.. రాగిణి ద్వివేదిల‌పై జాతీయ మీడియా క‌థ‌నాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. నెల‌రోజులు పైగానే అయ్యింది జైలులో అడుగుపెట్టి. డ్ర‌గ్స్ కేసులో బెయిల్ దొర‌క‌క‌పోవ‌డంపైనా మీడియా క‌థ‌నాలు హీట్ పెంచాయి. ఇక ఆ ఇద్ద‌రినీ క‌లిసేందుకు బంధువులు ఎవ‌రూ రాలేద‌ని జైల‌ర్లు నివేదించ‌డంతో ప‌రిస్థితి అంద‌రికీ అర్థమైంది.

అన్న‌ట్టు ఈ ద‌స‌రా పండుగ‌ను అయినా ఆ ఇద్ద‌రూ క‌లిసే జ‌రుపుకున్నారా? అంటే.. దానిపై మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి. కన్నడ నటీమణులు రాగిని ద్వివేది.. సంజన గల్రానీ పరప్పన అగ్రహార జైలులో దసరా వేడుకలు జరుపుకున్నారు. అయితే ఏదో మ‌మ అనిపించేశార‌ట‌. క‌నీసం దీపావ‌ళి అయినా ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకోవాల‌న్న‌ది వారి ఆకాంక్ష‌. ఆ క్ర‌మంలోనే బెయిల్ ప్ర‌య‌త్నాలు ఆగ‌లేదుట‌.

జైలులో ద‌స‌రా వేడుకలో వారిద్దరికీ హబ్బాడా ఓటా... అందులో భోజనంతో `ఒబట్టు` కూడా ఉన్నాయ‌ట‌. ఆ రెండూ క‌న్న‌డ ఆహార ప్ర‌దార్థాల‌న్న‌మాట‌. వారు ఇద్దరూ ఇతర జైలు ఖైదీలతో కలిసి వీటిని తిన్నార‌ట‌. ఖైదీలంతా దసరా రోజును ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించారు. వారితో పాటే రాగిణి సంజ‌న ప్రార్థ‌న చేశారు.

నటీమణులు ఇద్దరూ పండుగను తమ కుటుంబంతో గడపాలని ఆశించారు. కానీ మాదకద్రవ్యాల దర్యాప్తులో ఆ ఇద్ద‌రి బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించడం వలన జైలుకే అంకితం కావాల్సి వ‌చ్చింద‌ట‌. అనేక వాయిదా తరువాత శనివారం అవ్వాల్సిన వారి బెయిల్ రీ-అప్పీల్ విచారణలు మరింత ఆల‌స్యం అవుతున్నాయి. వీరికి దీపావళికి ముందు బెయిల్ పొందుతాయని .. పండుగకు ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. ఎన్.‌డి.పి.ఎస్‌ కోర్టు తమ బెయిల్‌ అభ్యర్ధనను తిర‌స్క‌రించడంతో రాగిణి.. సంజన కుటుంబాలు హెచ్‌.సి.కి వెళ్లాయి.

సెప్టెంబర్ 4 న రాగిణిని ద‌ర్యాప్తులో భాగంగా అరెస్టు చేశారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో సుదీర్ఘ దర్యాప్తు ఆమెతో నాలుగు గంటలకు పైగా జరిగింది. మరోవైపు సంజ‌న‌ను నాలుగు రోజుల తరువాత సెప్టెంబర్ 8 న అరెస్టు చేశారు. రాగిణి కేసు మాదిరిగానే ఆమె నివాసంలో కూడా దాడి జరిగింది. తరువాత సిసిబి కార్యాలయంలో విచారణ తర్వాత త‌న‌ను కూడా అరెస్టు చేశారు. ఇద్దరూ ఒకే త‌ర‌హా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారని.. వారు సాక్ష్యాలను దెబ్బతీశారని .. అలాగే మూత్ర పరీక్షల కోసం నమూనాలను సమర్పించడానికి నిరాకరించారని జాతీయ మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి.