సానియా చెల్లి అతడి విషయంలో క్లారిటీ ఇచ్చేసింది

Mon Sep 16 2019 22:32:57 GMT+0530 (IST)

Sania Mirza Sister Confirms her Relationship

సానియా చెల్లి అతడి విషయంలో క్లారిటీ ఇచ్చేసిందిటెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా గత ఏడాది భర్త నుండి అధికారికంగా విడాకులు తీసుకుంది. విడాకుల ముందు నుండే ఆనమ్ మీర్జా ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వచ్చాయి. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తనయుడు అసదుద్దీన్ తో ఆనమ్ మీర్జా ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆ విషయమై ఇద్దరు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వచ్చారు. సోషల్ మీడియాలో ఇద్దరు కూడా క్లోజ్ గా ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో పాటు కలిసి తిరగడం కూడా చేస్తున్నారు.ఎట్టకేలకు ఆనమ్ మీర్జా తన ప్రేమ విషయమై ఓపెన్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆనమ్ మీర్జా బ్రైడ్ టు బి అంటూ బెలూల్స్ తో రాసి ఉండగా వాటి ముందు పోజ్ ఇచ్చింది. దాంతో పాటు లవ్ ఈమోజీని కూడా పోస్ట్ చేసింది. బ్రైట్ టు బి అంటే కాబోయే వధువు అని అర్థం. గత కొన్నాళ్లుగా అసదుద్దీన్ తో ప్రేమలో ఉన్న ఈమె ఖచ్చితంగా అతడినే పెళ్లి చేసుకోబోతుంది అంటూ అంతా అనుకుంటున్నారు. దాంతో ఆనమ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలపడంతో పాటు అసదుద్దీన్ తో మీ జోడీ చాలా బాగుంటుందంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు.

మొదటి భర్త రషీద్ తో విభేదాల కారణంగా కొన్నాళ్ల క్రితం విడిపోయిన ఆనమ్ గత ఏడాది విడాకులు తీసుకుంది. విడాకులు అధికారికంగా రాకముందు నుండే చిన్ననాటి స్నేహితుడు అయిన అసదుద్దీన్ తో ఆనమ్ మీర్జా క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ఇప్పుడు వారిద్దరు త్వరలో ఒక్కటి అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. బ్రైడ్ టు బి అంటూ పోస్ట్ చేయడంతో ఆనమ్ మీర్జా తన ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. రెండు కుటుంబాల మద్య ఇప్పటికే చర్చలు జరిగి ఉంటాయని.. త్వరలోనే ఇరు కుటుంబాల వారు పెళ్లి విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.