'స్పిరిట్' పై నోరు విప్పిన క్రేజీ డైరెక్టర్..!

Thu Jul 07 2022 15:00:01 GMT+0530 (IST)

Sandeep Reddy Vanga on prabhas Spirit movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ సిల్వర్ జూబ్లీగా ''స్పిరిట్'' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. గతేడాది అక్టోబర్ లోనే #Prabhas25 ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి దీనిపై ఎలాంటి వార్తలు రాలేదు. అయితే తాజాగా సందీప్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మీడియాతో మాట్లాడారు.రాబోయే రోజుల్లో వైలెన్స్ చిత్రాలనే చేస్తారా లేదా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల వైపు వెళ్తారా అని వంగా ని ప్రశ్నించగా.. అది తెలియాలంటే రిలీజ్ వరకూ వేచి చూడండని చెప్పారు. ప్రస్తుతం తాను బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో 'యానిమల్' మూవీ షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నానని తెలిపారు.

దాని తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమా చేస్తానని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. ఈ వార్తతో డార్లింగ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఫస్ట్ సినిమా 'అర్జున్ రెడ్డి' తో సంచలనం సృష్టించిన సందీప్.. ప్రభాస్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తారని భావిస్తున్నారు.

అద్భుతమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో నటించాడని వేచి ఉండలేనని.. అభిమానులు ఎలాంటి అవతార్ లో తనను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అలాంటి చిత్రంతో రాబోతున్నానని ప్రభాస్ అనౌన్స్ మెంట్ సందర్భంగా పేర్కొన్నారు.

'స్పిరిట్' టైటిల్ లో స్టార్స్ ని బట్టి ఈ సినిమాలో ప్రభాస్ ఓ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కీలక పాత్ర పోషించనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టీసిరీస్ - యూవీ క్రియేషన్స్ మరియు సందీప్ వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాయి. భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్ - వంగా ప్రణయ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనునున్న ఈ సినిమాని తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ మండరిన్ జపనీస్ మరియు కొరియా భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇకపోతే 'రాధే శ్యామ్' చిత్రంతో పరాజయం అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే మైథలాజికల్ డ్రామాలో నటిస్తున్నారు. అలానే ప్రశాంత్ నీల్ తో 'సలార్'.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'ప్రాజెక్ట్ K' వంటి సినిమాలు చేస్తున్నారు. మధ్యలో మారుతీతో ఓ మూవీ చేయడానికి డార్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు.