సందీప్ వంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసిందిగా!

Thu Oct 10 2019 11:55:42 GMT+0530 (IST)

Sandeep Reddy Vanga Next Movie Announcement

డైరెక్టర్ సందీప్ వంగా కొత్త సినిమాపై గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.   ఫైనల్ గా సందీప్ తన కొత్త సినిమా ప్రకటన అధికారికంగా వచ్చేసింది. ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ తన నెక్స్ట్ సినిమాను 'కబీర్ సింగ్' నిర్మాతలు భూషణ్ కుమార్.. మురాద్ ఖేతానిలతో చేస్తున్నాని వెల్లడించారు.'అర్జున్ రెడ్డి' తో సంచలనం సృష్టించిన సందీప్ వంగా తన రెండవ సినిమాను బాలీవుడ్ లో చేశారు.  'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' ఒరిజినల్ కంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.  ఆ సినిమాను టీ సీరీస్.. సినీ1 స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.  ఇప్పుడు వారితో సందీప్ మరోసారి కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణంలో సందీప్ వంగా హోమ్ బ్యానర్ భద్రకాళి ఫిలిమ్స్ కూడా పాలుపంచుకుంటుంది.  ఈ విషయాన్నీ టీ సీరీస్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా వెల్లడించారు.

ఇక ఈ ప్రాజెక్టు గురించి సందీప్ మాట్లాడుతూ "భూషణ్ జీ.. మురాద్ భాయ్ లతో మరో సరి కలిసి పని చేయడం చాలా సంతోషం.  ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా.. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. దర్శకుడికి అవసరమైన క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాతలతో పని చేయడం చాలా సంతోషం" అన్నారు.  ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర టెక్నిషియన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు.