Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్.. అలా బిజీగా ఉన్నాడట!

By:  Tupaki Desk   |   13 Nov 2019 4:21 PM GMT
సందీప్ కిషన్.. అలా బిజీగా ఉన్నాడట!
X
గతంతో పోలిస్తే సందీప్ కిషన్ ఊపు ఇప్పుడు తగ్గింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా కు ముందు, తర్వాత ఈ హీరో మంచి ఊపు మీద కనిపించాడు. అయితే కొన్ని ఫ్లాపుల తో ఇతడు వెనుకబడ్డాడు. ఇటీవలే ఒక హారర్ సినిమాతో సందీఫ్ మళ్లీ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.

ఈ ఉత్సాహం తో 'తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ' గా రాబోతున్నాడు ఈ హీరో. ఈ వారంలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఇలాంటి నేపథ్యం తో తన చేతిలో ఉన్న ప్రాజెక్టు ల గురించి సందీప్ చెప్పాడు.

ఇటీవలే హిందీ వెబ్ సీరిస్ 'ఫ్యామిలీ మ్యాన్' లో నటించినట్టుగా చెప్పాడు. అందులో తొలి పార్టు తో తను నటించానని, రెండో పార్టు లో తను ఉండబోవడం లేదని, మూడో పార్టు లో నటించబోతున్నట్టు గా సందీప్ చెప్పాడు. అలాగే తమిళం లో మూడు సినిమాలు తనవి విడుదల కు రెడీగా ఉన్నాయని చెప్పాడు.

తనకు పలు వెబ్ సీరిస్ లలో నటించమని అవకాశాలు వస్తున్నట్టుగా, అయితే ఇప్పుడు తెలుగులో సినిమాలు చేసే ఆసక్తి తో ఉన్నట్టుగా చెప్పాడు ఈ హీరో. తమిళం లో మూడు సినిమాలూ విడుదల అయ్యాకా కొత్త సినిమాల కు ఓకే చేయనున్నట్టు గా చెప్పాడు.

ఏతా వాతా తను అవకాశాలతో బిజీగానే ఉన్నట్టు గా ఈ హీరో చెప్పాడు. 'తెనాలి రామకృష్ణ' సందీప్ కు తెలుగు లో చాలా కీలకమైన సినిమానే అవుతోంది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఆకట్టుకుంటే ఇతడు మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చినట్టే.