Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ - ప్రియావారియర్.. మధ్యలో వరలక్ష్మి!

By:  Tupaki Desk   |   24 Feb 2021 9:30 AM GMT
సందీప్ కిషన్ - ప్రియావారియర్.. మధ్యలో వరలక్ష్మి!
X
యంగ్ యాక్ట‌ర్‌ సందీప్ కిష‌న్ హీరోగా.. నూత‌న ద‌ర్శ‌కుడు వేద‌వ్యాస్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌ని ఈ చిత్రాన్ని.. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్నారు. గ‌త నెల‌లోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మధ్యనే మొద‌లైన రెగ్యుల‌ర్ షూట్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

కాగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను తీసుకున్నారు. ఇప్పటికే తెలుగులో నితిన్ స‌ర‌స‌న ‘చెక్’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. అది రిలీజ్ కాకుండానే సందీప్ కిషన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

అయితే.. ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కు తమిళ్ సంచలనం వరలక్ష్మి శరత్ కుమార్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు వరలక్ష్మి. రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రాలతో మరింత పాపులారిటీ సాధించిన ఆమె.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు. కాగా.. సందీప్ కిషన్ గత చిత్రం ‘తెనాలి రామకృష్ణ‌’లోనూ లేడీ విలన్ గా నటించారు వరలక్ష్మి. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ అప్ కమింగ్ మూవీ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ తొలి తెలుగు చిత్రాన్ని డైరెక్ట‌ర్ డెన్నిస్ జీవ‌న్ రూపొందించారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.