పిక్ ఆఫ్ ది డే: డిస్కోరాజా శాండ్ ఆర్ట్

Sun Sep 15 2019 16:20:51 GMT+0530 (IST)

Sand Art on Ravi Teja Disco Raja Movie

మాస్ మాహారాజా రవితేజ - వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'.  రవితేజ సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తూ ఉండడంతో ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని రవితేజ గట్టిగా ప్రయత్నిస్తున్నారట.  ఈ సినిమా స్క్రిప్ట్ చాలా రోజులే క్రితమే వీఐ ఆనంద్ రెడీ చేసినప్పటికీ బెస్ట్ వెర్షన్ వచ్చేవరకూ రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  అయితే ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక మాత్రం షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్ళూరి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ "గోవా షెడ్యూల్ పూర్తయింది.  ఇది ఆర్ట్ డైరెక్టర్ నరేంద్ర గారు చేసిన 'డిస్కోరాజా' శాండ్ ఆర్ట్" అంటూ ట్వీట్ చేశారు.  ఈ ఫోటోలో సముద్రం ఒడ్డున ఇసుకతో 'డిస్కోరాజా' టైటిల్ ను ఆయన పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడం విశేషం.  ఇసుకతో చేసిన టైటిల్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా 'డిస్కోరాజా' టీమ్ ఆ శాండ్ ఆర్ట్ కు వెనక నిలుచుని ఏదో ఆలోచిస్తున్నట్టు పోజిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'డిస్కోరాజా' లో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.