Begin typing your search above and press return to search.

వీడియో: ప్ర‌భుదేవా లారెన్స్ జానీ మాస్ట‌ర్ స‌రిపోరు!

By:  Tupaki Desk   |   1 Feb 2023 5:02 PM GMT
వీడియో: ప్ర‌భుదేవా లారెన్స్ జానీ మాస్ట‌ర్ స‌రిపోరు!
X
ఈ బుడ‌త‌డి డ్యాన్సింగ్ స్టైల్ ముందు ప్ర‌భుదేవా లారెన్స్ జానీ మాస్ట‌ర్ స‌రిపోరు! రెమో డి సౌజా అంత‌టివాడే చేతులెత్తేశాడు. ఇక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ల‌యితే అత‌డి షో చూసి స్పెల్ బౌండ్ అయిపోయి మ‌తి చెడింద‌ని కాంప్లిమెంట్లు ఇచ్చేశారు. ఫ‌రాఖాన్ అంత‌టి డ్యాన్సింగ్ దిగ్గ‌జం అత‌డి పెర్ఫామెన్స్ కి సాహో చెప్పారు.

భ‌విష్య‌త్ లో కొరియోగ్ర‌ఫీ కింగ్ అయ్యేంత‌టి స‌త్తా ఈ బాల‌కుడికి ఉంది. నూనూగు మీసాలు రాక ముందే హీరోయిక్ లుక్ ఛామ్ కూడా క‌నిపిస్తోంది అపుడే. అయితే నిండా ప‌ద‌హారేళ్ల‌యినా నిండ‌ని ఈ కుర్రాడెవ‌రు? అంటే... పేరు సంచిత్. హిందీ బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోల‌ను ఏల్తున్నాడు. సంచిత్ స్టైల్ పేరుతో ఇన్ స్టా మాధ్య‌మంలో అత‌డి జోష్ కి ల‌క్ష‌లాది లైక్ లు క్లిక్ లు ప‌డిపోతున్నాయ్.

నిరంత‌రం అత‌డి డ్యాన్సింగ్ వీడియోల‌కు బోలెడంత గిరాకీ ఏర్ప‌డింది. తాజాగా స్టేజ్ బ్యాక్ సైడ్ లో సంచిత్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోకి 10ల‌క్ష‌ల లైక్ లు సునాయ‌సంగా వ‌చ్చాయంటే అర్థం చేసుకోవాలి.

సోని టీవీ సూప‌ర్ డ్యాన్స్ సిరీస్ లో అత‌డు షో స్టాప‌ర్ గా నిలిచాడు. రెమో డి సౌజా అంత‌టి జ‌డ్జి మోకాళ్ల‌పై కూచుని అత‌డి షోని క‌నులారా వీక్షించాడంటే అర్థం చేసుకోవాలి. ఇంకా వ‌ర్ణించాలంటే గోల్డెన్ గ్లోబ్ అందుకున్న నాటు నాటు స్టెప్పుల్ని మించి లైవ్ వైర్ లా చెల‌రేగిపోవ‌డం ఈ బాల‌కుడి స్టైల్. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ ఒకే శ‌రీరంలో ప్ర‌వేశించి డ్యాన్సాడితే పుట్టినంత ఎన‌ర్జీ అత‌డిలో రీక్రీయేట‌వుతోంది.

sanchitstyle పేరుతో ఇన్ స్టా ప్రొఫైల్ లో అత‌డి డ్యాన్సింగ్ క్లిప్ ల‌ను వీక్షించేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. అత‌డి స్టైల్ పై టీమిండియా మాజీ ర‌థ సార‌థి విరాట్ కోహ్లీ అంతటి వాడే ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఇలాంటి ప్ర‌తిభ‌ను ఆవిష్క‌రించేందుకు ప్రోత్స‌హించేందుకు @sonytvofficial మాధ్యమంగా ఉన్నందుకు ధన్యవాదాలు అని విరాట్ ఈ వీడియోకి వ్యాఖ్య‌ను జోడించాడు. ఇప్ప‌టికే అత‌డు ఒక స్టార్. భ‌విష్య‌త్ లో సంచిత్ అంత‌కుమించి అవుతాడ‌న‌డంలో సందేహం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.