Begin typing your search above and press return to search.

క్వారంటైన్ టైమ్ ఇలా మేకోవ‌ర్ కోసమా?

By:  Tupaki Desk   |   3 April 2020 3:30 AM GMT
క్వారంటైన్ టైమ్ ఇలా మేకోవ‌ర్ కోసమా?
X
క‌రోనా క‌ల్లోలంతో ఎవ‌రికి వారు ఇండ్ల‌లోనే లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌య‌ట తిరిగే వెసులుబాటు లేక‌పోవ‌డం తో ఎవ‌రికి వారు స్వ‌యంసేవ‌నంలో మునిగి తేలుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు ఇల్లు ఒళ్లు శుభ్రం చేసుకోవ‌డం నుంచి వంటా వార్పుతో పాటు భ‌ర్త‌ల‌కు సేవ‌లు చేసేందుకు టైమ్ కేటాయిస్తున్నారు. మ‌రికొంద‌రు క‌స‌ర‌త్తులు చేసి ఫ్యాట్ త‌గ్గించుకుంటుంటే.. ఇంకొంద‌రు మాత్రం మేక‌ప్ ప‌రంగా ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు.

ఇదిగో కింగ్ నాగార్జున హీరోయిన్ స‌నా ఖాన్ ఏం చేస్తోందో చూడండి. గ‌గ‌నం చిత్రం లో న‌టించిన స‌నా ఖాన్ కి ఆ త‌ర్వాత తెలుగులో ఏమంత అవ‌కాశాలు రాలేదు. అటుపై స‌ల్మాన్ భాయ్ అండ‌తో బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు అందుకుంది. అయినా అవేవీ క‌లిసి రాలేదు. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఖాళీగా ఉంది. ఇక‌పోతే దేశం లాక్ డౌన్ నేప‌థ్యంలో స‌నా ఖాన్ ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉంది. ఆ స‌మ‌యంలో హెయిర్ స్టైల్స్ ప‌రంగా ఇదిగో ఇలా ప్ర‌యోగాలు చేస్తోంది. స‌నాఖాన్ హెయిర్ స్వ‌త‌హాగా క‌ర్లింగ్ స్వ‌భావం ఉన్న‌ది. దానికి ఇలా సాఫ్టెనింగ్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఎలాగోలా టైమ్ ని సద్వినియోగం చేస్తోంది.

స‌నా గ‌త ఏడాది ఆయోగ్య చిత్రంలో న‌టించింది. విశాల్ మూవీ లో చ‌క్క‌ని న‌ట‌న‌ తో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం టామ్ డిక్ అండ్ హ్యారీ 2 లో న‌టిస్తోంది. దీపిక్ తిజోరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిమ్ షేర్గిల్- ఆఫ్తాబ్ శివ‌దాసాని- ష‌ర్మాన్ జోషి- పూజా చోప్రా- అమైరా ద‌స్తూర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల షూటింగ్ వాయిదాల్లో ప‌డింది. ఇక‌పోతే సౌత్ లో ఈ అమ్మ‌డికి అస‌లు ఆఫ‌ర్లు అన్న‌వే లేవు. ఇక ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే సోష‌ల్ మీడియాల్లో ఈ అమ్మ‌డు చాలానే వెన‌క‌బ‌డింది.