ఆ దర్శక నటుడి మాటలు వింటే పవర్ స్టార్ 'మేజిక్' అర్థమవుతుంది

Fri May 13 2022 10:03:52 GMT+0530 (IST)

Samudrakhani About PawanKalyan

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. అందునా.. తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న అగ్రనటులు చాలామందే ఉన్నారు. వారెంత మంది ఉన్నా.. సినిమాలు చేసినా చేయకున్నా.. హిట్లు లేకున్నా.. ప్లాప్ లు మాత్రమే పలుకరించినా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గని అగ్రనటుడు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమేనని చెప్పాలి.ఆయన హిట్.. ప్లాప్ లకు అతీతుడిగా చెప్పాలి. పవన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అభిమానుల్లో వచ్చే వైబ్రేషన్స్ మామూలుగా ఉండవని చెబుతారు.

ఆయనకు అభిమానులుగా సాదాసీదా ప్రజలే కాదు.. చిత్ర పరిశ్రమలోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. పర భాషా నటీనటులు.. టాలీవుడ్ అగ్ర హీరోల్ని విపరీతంగా అభిమానించే క్రెడిట్ పవన్ కల్యాణ్ సొంతంగా చెప్పాలి. తాజాగా పవర్ స్టార్ మేజిక్ ఏమిటన్న విషయాన్ని ప్రముఖ దర్శకుడు కమ్ నటుడిగా.. అగ్రశ్రేణి విలన్ గా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న సముద్ర ఖని.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి ప్రస్తావించారు.

తాను పవన్ కల్యాణ్ అభిమానినని.. తనలాంటి వారందరి తరఫున ఆలోచించి 'వినోదాయ సీతాం' రీమేక్ ను ఆయనతో చేస్తున్నట్లుగా వెల్లడించారు. చిత్ర నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఈ మూవీ ఫాంటసీ డ్రామాగా రూపొందిస్తారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించటం తెలిసిందే. ఇందులో తంబి రామయ్య.. సముద్రఖని కీలక పాత్రలు పోషించటం తెలిసిందే.

ఈ డ్రామాను తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తో పాటు యంగ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. ఏమైనా.. ఒక సినీ ప్రముఖుడికి అభిమానులు కోట్లాది మంది ఉండొచ్చు. కానీ.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది పవన్ ను అభిమానించటం మాత్రం ఆయనకే సాధ్యమని చెప్పాలి. పలువురు యూత్ హీరోలు పవన్ ను ఎంతలా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.