మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూ

Tue Aug 13 2019 18:01:59 GMT+0530 (IST)

Sampoornesh Babu Donates 2 Lakhs To Karnataka Floods

రూపాయి ఇచ్చినా సాయమే.. కానీ ఆ రూపాయి ఇచ్చేందుకు కూడా కొందరికి మనసు రాదు. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు కాని కొద్ది మంది మాత్రమే విపత్తు సమయంలో సాయంకు ముందుకు వస్తారు. అయితే సంపూర్నేష్‌బాబు మాత్రం ఎప్పటికప్పుడు ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తూనే ఉంటాడు. చేసే సాయం ఎంత అయినా ఆయన నలుగురికి ఆదర్శంగా ఉంటాడని మాత్రం చెప్పగలం. ఇప్పటి వరకు ఎన్నో విపత్తుల సమయంలో ఆర్ధిక సాయం చేసిన సంపూర్నేష్ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.కర్ణాటకలో వదరల కారణంగా జనజీవనం అస్థవ్యస్థం అవుతుంది. అత్యంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఉత్తర కర్ణాటకలో వదరలు జీవితాలను నాశనం చేశాయి. ఉత్తర కర్ణాటకలోని వదల పరిస్థితిని చూసి చలించిన సంపూర్నేష్ బాబు తనవంతు సాయంగా రెండు లక్షల రూపాయలను కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లుగా ప్రకటించాడు. సంపూ చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో సంపూపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్విట్టర్ లో సంపూ ఈ విషయమై స్పందిస్తూ... ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలచివేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాలను దశాబ్దాలుగా ఆధరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం చిత్రం నుండి కూడా ప్రేమిస్తున్నారు. వరదలకు సంబంధించిన ఫొటోలు చూసిన సమయంలో చాలా బాధవేసింది. అందుకే నా వంతుగా 2 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

ఇటీవలే వచ్చిన 'కొబ్బరిమట్ట' చిత్రం మంచి టాక్ ను దక్కించుకుని భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ఆ జోష్ లో ఉన్న సంపూర్నేష్ బాబు మంచి మనసుతో ఈ సాయం చేయడం జరిగింది. గతంలో కూడా ఆయన పలు విపత్తుల సమయంలో సాయం చేయడం మనందరికి తెలిసిన విషయమే.