Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ తెల్ల వెంట్రుక‌లకు రంగేయ‌దేమీ?

By:  Tupaki Desk   |   15 Sep 2021 5:30 PM GMT
స్టార్ హీరోయిన్ తెల్ల వెంట్రుక‌లకు రంగేయ‌దేమీ?
X
ఇటీవ‌ల బాడీ షేమింగ్ తో పాటు చాలా విజ్ఞాన‌దాయ‌క విష‌యాల‌పై హీరోయిన్ లు ఓపెన్ గా మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే. తమ రీల్ లైఫ్‌.. రియ‌ల్ లైఫ్ ని అభిమానుల‌తో పంచుకుంటూ రెండింటి మ‌ధ్య వున్న తేడాని ఓపెన్ గానే ప్రేక్ష‌కుల‌కు,.. అభిమానుల‌కు అర్థ‌మ‌య్యేలా చెబుతున్నారు. కొంత మందేమో నిత్యం త‌మ గ్లామ‌ర్ ఫొటోల‌తో ఆక‌ట్టుకుంటుంటే మ‌రి కొంత మందేమో త‌మ రియ‌ల్ గ్లామ‌ర్ ని.. రియ‌ల్ ఫేస్ ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హీరోయిన్ స‌మీరా రెడ్డి కూడా ఇలాంటి ప‌నే చేసింది.

సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న‌దామె. ఇటీవ‌ల రెండ‌వ సంతానానికి జ‌న్మ‌నిచ్చిన స‌మీరారెడ్డి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న స‌హ‌జ‌మైన మేక‌ప్ లేని రూపానికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేసి అభిమానుల‌తో పాటు త‌న తండ్రికి కూడా షాకిచ్చింది. స‌మీరా ఏంటీ ఇలా చేస్తోంది. ఆమెని అభిమానులు త‌ప్పుగా అర్థం చేసుకుంటారు క‌దా? విత్ ఔట్ మేక‌ప్ ఫొటోల‌ని.. హెయిర్ క‌ల‌ర్ వేసుకోకుండా తెల్ల‌ని జుట్టు క‌నిపిస్తున్న ఫొటోల‌ని ఎందుకు పోస్ట్ చేస్తోంది?.. ఇలా ఎందుకు చేస్తున్నావ‌ని స‌మీరా తండ్రి కంగారుగా అడిగేశాడ‌ట‌.

దానికి నటి స‌మీరారెడ్డి చెప్పిన స‌మాధానం నెట్టింట వైర‌ల్ గా మారింది. తాను మాన‌సిక రుగ్మ‌త‌కు గుర‌వుతున్న వ్య‌క్తిని కాద‌ని త‌న‌కు న‌చ్చిన‌ప్పుడే హెయిర్ క‌ల‌ర్ వేసుకుంటాన‌ని స‌మాధానం చెప్పింది.
తన రెండు చిత్రాలను అబిమానుల‌తో పంచుకుంటూ సమీరా ఇలా వ్రాసింది,.. “నేను నా తెల్ల జుట్టును ఎందుకు కప్పుకోవడం లేదని నాన్న నన్ను అడిగారు. ప్రజలు నన్ను త‌ప్పుగా అర్థం చేసుకుంటారు క‌దా అని తను ఆందోళన చెందాడు. దానికి నేను ఇలా సమాధానమిచ్చాను ‘నేను తెల్ల జుట్టుతో క‌నిపిస్తే వృద్ధురాలిన‌ని అర్థం. అందంగా లేదు . త‌న‌ని తాను అందంగా తీర్చిదిద్దలేదు. ఆకర్షణీయంగా లేదు? అని భావిస్తారు. అయితే నేను మునుపటిలాగా ప్రతి 2 వారాలకు రంగు వేసుకుంటాను కాబట్టి ఎవరూ ఆ తెల్లని గీతను పట్టుకోలేరు. ఈ రోజు నేను నా స్వీయ‌ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు నచ్చినప్పుడు రంగు వేసుకుంటాను`` అని తెలిపింది.

సమీరా ఇంకా ఇలా చెప్పుకొచ్చింది. ప్రేక్ష‌కుల్లో అభిప్రాయాన్ని మార్చ‌డానికి ఎందుకు అలా వుండాలి అని మా నాన్న న‌న్ను అడిగారు. ఎందుకు వుండ‌కూడ‌దు అని స‌మాధానం చెప్పాను. నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. పాత ఆలోచనలు విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే మార్పు, అంగీకారం మొదలవుతుంది. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్న‌ప్పుడు విశ్వాసం సహజంగానే కనుగొనగలిగినప్పుడు ముసుగు లేదా కవర్ వెనుక దాక్కొని వుండాల్సిన‌,.. హెయిర్ కి క‌ల‌ర్ వేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు అన్న‌ది మా నాన్నకు అర్థమైంది. తండ్రిగా అతని ఆందోళనను నేను అర్థం చేసుకున్నాను` అని చెప్పుకొచ్చింది.

డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డిన న‌టి

ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక ద‌శ‌లో డిప్రెషన్ (ఒత్తిడి)ని ఎదుర్కొన్న వారే. అలానే సెల‌బ్రిటీల్లో ఎంద‌రో తీవ్ర‌మైన డిప్రెష‌న్ ని ఎదుర్కొని ఆ త‌ర్వాత దాని నుంచి బ‌య‌ట‌ప‌డి ఎదిగిన వాళ్లే. గ‌తంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న వ‌రుస సినిమాల్లో న‌టించిన స‌మీరా రెడ్డి చాలా కాలం క్రితం డిప్రెష‌న్ ని ఎదుర్కొన్నాన‌ని పేర్కొన్నారు. సమీరా రెడ్డి తాను ఎదుర్కొన్న నిరాశ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆమె ఎలా వ్యవహరించారో మాట్లాడారు. తాను ఏమాత్రం సంతోషంగా లేని రోజుల గురించి.. నిరాశను ఎదుర్కొన్న సమయం గురించి స‌మీరా ఇటీవ‌ల‌ తెలిపారు. తన జీవితంలో ఎదుర్కొంటున్న డిప్రెషన్ సమస్యలపై సమీరా రెడ్డి మాట్లాడారు. తీవ్ర నిరాశ‌ను ఆమె అధిగ‌మించాన‌ని తెలిపారు.

ఇన్ని విజయవంతమైన సినిమాలు చేసి.. ఇంత డబ్బు సంపాదించినా గొప్ప పేరు వ‌చ్చిన‌ ఒక అమ్మాయి.. త‌న‌ను తాను చాలా చిన్నదానిగా భావించి.. రొటీన్ గా చెత్తగా ఉన్నాను అని క‌ల‌త‌కు గుర‌య్యేదానిని. ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదు అని స‌మీరా అన్నారు.

మీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవ‌డం లేదు. ప్రజలు మీపై విసిరిన తమాషా విషయాలు... ఒకరు చెప్పినట్లు ఓహ్ మీరు ఇంత అందమైన నటి అన్న‌ది చెబితే కానీ తెలీదు.. నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నందున నేను చేసిన ఆ అద్భుతమైన చిత్రాలన్నీ త‌ర‌చి చూస్తాను.. నేను న‌టిని కానేమో అని ఒకానొక స‌మ‌యంలో అనుకున్నాను.

నేను ప్రతి రోజు విశ్వాసంతో పనిచేస్తాను. విశ్వాసం మీ మీద పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ వ్యవహరించాల్సిన విషయాలు పరిపూర్ణంగా ఉండవు.. అని స‌మీరా అన్నారు. నేను దేవుడిపై త‌క్కువ భారం వేశాను. ఈ ప్ర‌పంచంలో ఏ స్త్రీ అయినా చాలా చిన్న స్థాయిలోనే ఉంటుంద‌ని తెలుసుకున్న‌ప్పుడు సాంత్వ‌న క‌లుగుతుంద‌ని స‌మీరా అన్నారు.