డెలివరీ తర్వాత ఆ బాధ వర్ణనాతీతం

Fri Jul 19 2019 20:00:01 GMT+0530 (IST)

బిడ్డకు జన్మనివ్వక ముందు.. జన్మనిచ్చాక తల్లి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి?  బాధలేవైనా ఉంటాయా? అంటే సమీరారెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఆసక్తికరం. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి ఆపరేషన్ తర్వాత సి-సెక్షన్ (పొట్ట దిగువ భాగం) బాధల్ని విడమర్చి చెప్పారు. ఆ బాధ తాళడం అంత సులువు కాదని ఆమె తన అనుభవాన్ని వెల్లడించారు.బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం ఎంతో గొప్పది. కానీ డెలివరీ తర్వాత బాధలు వర్ణనాతీతం! అని తెలిపారు. సి-సెక్షన్ .. కుట్లు ఎంతగా బాధిస్తాయో ఊహించలేమని అన్నారు. డెలివరీ ముందు.. డెలివరీ తర్వాత ఒక గర్భిణి బాధల గురించి అభిమానులతో పంచుకుంటానని ముందే చెప్పాను. అందుకే ఇవన్నీ చెబుతున్నానని అన్నారు. తన రెండో బిడ్డ జననానికి ముందు అండర్ వాటర్ ఫోటోషూట్ గురించి తెలిసిందే.

జూలై 12న కథానాయిక సమీరా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే ఆ బిడ్డ ఫోటోని అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. నేటితో తను జన్మించి ఐదు రోజులైంది. ఇప్పటికీ పొట్ట భాగం వాపుతో బాధపెడుతోందని సమీరా వెల్లడించారు. ``హార్మోనల్ గా ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నా. అన్నిటినీ ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నా. ఈ మార్పుల తర్వాత పొట్ట చుట్టూ ఓ సిల్వర్ లైనింగ్ వస్తుంద``ని తెలిపారు. స్లీప్ లెస్ నైట్స్.. ఎండ్ లెస్ ఫీడింగ్! అంటూ బేబితో తన అనుభవాన్ని వెల్లడించారు సమీరా. 2014లో బిజినెస్ మేన్ అక్షయ్ వార్ధేని పెళ్లాడిన సమీరా ఇద్దరు బిడ్డల తల్లిగా ఆ ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు.