Begin typing your search above and press return to search.

రిషికేశ్ మహర్షి ఆశ్రమంలో సమంత..!

By:  Tupaki Desk   |   23 Oct 2021 2:37 AM GMT
రిషికేశ్ మహర్షి ఆశ్రమంలో సమంత..!
X
'శాకుంతలం' తర్వాత సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన స్టార్ హీరోయిన్ సమంత.. పరస్పర అంగీకారంతో తన భర్త అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన తర్వాత సామ్ సినిమాల్లో నటిస్తుందా లేదా అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఈ కనేపథ్యంలో దసరా సందర్భంగా రెండు బైలింగ్వల్ ప్రాజెక్ట్ లను ప్రకటించి అందరికీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడున్న ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న సమంత.. తన స్నేహితులతో సమయాన్ని గడుపుతోంది.

సమంత తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలసి ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. శిల్పా రెడ్డి ఓ రోజు క్రితమే సమంత, తాను యమునోత్రి కి వెళ్లినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఉత్తర భారతాన ఉన్న సామ్.. రిషీకేశ్ లోని మహర్షి మహేశ్ యోగి ఆశ్రమాన్ని సందర్శించినట్టు ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

మహేశ్ యోగి ఆశ్రమానికి 1968లో బీటిల్స్ సభ్యులు వెళ్ళారని.. అక్కడే కొన్ని రోజులు ఉండి అతీంద్రియ ధ్యానాన్ని అభ్యసించారని సమంత పేర్కొంది. ఆ సమయంలో దాదాపు 48 పాటలను ఇదే ఆశ్రమంలో స్వరపరిచారని.. అలాంటి ప్రదేశంలో తాను ఇప్పుడు నిల్చున్నానని సామ్ తెలిపింది. మొత్తం మీద తన ఫ్రెండ్ తో కలిసి సమంత ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా మానసిక ప్రశాంతత పొందుతోందని అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో సామ్ తీర్థయాత్రకు సంబంధించి ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తుందో చూడాలి.

ఇదిలా వుండగా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్ ను కూకట్ పల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్ వేయొచ్చన్న సమంత తరఫు న్యాయవాది వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. తనకు పరువునష్టం కలిగించేలా మాట్లాడటాన్ని నిరోధించాలన్న సామ్ అభ్యర్థనపై సోమవారం విచారణ జరపనుంది.

నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు ఓ టీవీ ఛానల్ మరియు పాపులర్ యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని.. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని సామ్ పిటిషన్ లో పేర్కొన్నారు.