Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన స‌మంత‌..?!

By:  Tupaki Desk   |   11 Feb 2022 7:30 AM GMT
మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన స‌మంత‌..?!
X
సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి నాలుగేళ్ల వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారో తెలీక‌పోయినా.. అభిమానులు మాత్రం మ‌ళ్లీ వీరి క‌లిస్తే చూడాల‌ని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విడాకుల త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డింది.

అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీల్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. భాష‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న సామ్ త‌మిళంలో `కాతువాకుల రెండు కాదల్` అనే సినిమా చేస్తోంది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స‌మంత‌, విజయ్‌ సేతుపతి, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో ఒక‌ప్ప‌టి టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కూడా న‌టిస్తున్నాడు. తాజాగా మేక‌ర్స్ ఈయ‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రివిల్ చేయ‌గా.. అందులో శ్రీశాంత్ ఎంతో హ్యాండ్సమ్‌గా క‌నిపిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఇక‌పోతే ఈ చిత్రంలో శ్రీ‌శాంత్ పాత్రేంట‌ని ఆరా తీయ‌గా.. ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాలో స‌మంత ల‌వ్‌లో ఫెయిల్ అవ్వ‌డం వ‌ల్ల ప్రేమ‌పై విర‌క్తి పెంచేసుకుంటుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ల‌వ్ చేసుకుంటున్న త‌న స్పేహితులు విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌ల‌ను సైతం విడతీసేస్తుంద‌ట‌.

ఇక అలాంటి స‌మ‌యంలో శ్రీ‌శాంత్ ఎంట్రీ ఉంటుంద‌ని.. స‌మంత మ‌న‌సులో ఉన్న నెగ‌టివిటీని తొల‌గించి మ‌ళ్లీ ఆమెను త‌న‌ ప్రేమ‌లో ప‌డేస్తాడ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.