యాక్షన్ కోసం అక్కడికి వెళ్లిన సామ్

Sat Sep 24 2022 13:10:08 GMT+0530 (India Standard Time)

Samantha went to America for this Amazon Project Action Drama

ప్రస్తుతం స్టార్ హీరోల రేంజ్ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమంత రూత్ ప్రభు విడాకుల తర్వాత తన కెరీర్ పై మరింత ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అర్థమవుతుంది. ఇదివరకే కొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులను చేసిన సమంత ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం తనకి స్థాయి మరో లెవెల్ కు వెళ్లే విధంగా అడుగులు వేస్తోంది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ గా తన పాత్రలతో హీరోలతో సమానంగా ఉండేవిధంగా కూడా జాగ్రత్త పడుతోంది.అంతేకాకుండా పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీ త్వరలోనే మార్షల్ ఆర్ట్స్ అలాగే వివిధ యాక్షన్ సన్నివేశాలాల్లో నటించడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాబోయే సినిమాలో సమంత గతంలో ఎప్పుడు లేనంత యాక్షన్ ఎలెమెంట్స్ చూపించబోతున్నట్లుగా సమాచారం. సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది.

అక్కడి నుంచి ఆమెకి ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో సిటాడెల్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఈ ఆమెజాన్ ప్రాజెక్ట్ కోసం సమంత అమెరికా వెళ్ళింది. అక్కడే యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు సమంత నుంచి రావాల్సిన మరో రెండు సినిమాలు కూడా విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.

ముఖ్యంగా థ్రిల్లర్ మూవీగా రానున్న  యశోద సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే గురశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం సినిమా కూడా నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఆ సినిమా డిసెంబర్ విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.